టీ20 క్రికెట్ లీగ్‌లలో ఐపీఎల్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగ్‌లో పాపులారిటీలో, రెవెన్యూలో ఐపీఎల్ టాప్‌లో ఉంది. ఇప్పటికైతే ఐపీఎల్‌ను కొట్టే క్రికెట్ లీగ్ లేదు. దీనికి ప్రధాన కారణం టీమిండియా ఆటగాళ్లు విదేశీ లీగ్‌లు ఆడకుండా కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడటం. క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లో క్రికెటర్లకు కూడా కోట్లలో అభిమానులు ఉంటారు.
కోహ్లీపై ఉన్న అభిమానంతో బెంగుళూరు టీమ్‌కు సపోర్ట్ చేసే అభిమానులు చాలా మంది ఉన్నారు. అలాగే ధోని ఫ్యాన్స్ చెన్నైను తమ హోమ్ టీమ్‌గా భావిస్తారు. అప్పుడు కోహ్లీ, ధోని వెళ్లి విదేశీ లీగ్‌లో ఆడితే ఆ లీగ్‌ను కూడా ఇండియన్ ఫ్యాన్స్ ఆదరిస్తే.. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ పడిపోతుందని బీసీసీఐ ఇండియన్ క్రికెటర్లను విదేశీ లీగ్‌లో ఆడేందుకు అనుమతించదు. ఇండియాలో ఫస్ట్ మొదలైన ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ఆడిన ఆటగాళ్లపైనే బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
కాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇదే విషయంపై బీసీసీసీకి, ఇండియన్ క్రికెటర్లకు రిక్వెస్ట్ చేశాడు. భారత క్రికెటర్లును బిగ్ బాష్, కరేబీయన్ లీగ్స్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వాలని గిల్‌క్రిస్ట్ కోరాడు. ఇండియన్ క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉందని, వాళ్లను కూడా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడేందుకు పర్మిషన్ ఇవ్వాలని అన్నాడు. దీని వల్ల ఐపీఎల్‌కు వచ్చే నష్టమేమి లేదని.. ఇండియన్ క్రికెటర్లకు ఉన్న ఫాలోయింగ్ వల్ల ఐపీఎల్‌కు విదేశాల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తుందని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు.
ఈ విషయంలో బీసీసీఐ కాస్త పెద్ద మనసు చేసుకుని ఇండియన్ క్రికెటర్లు సైతం విదేశీ టీ20లీగ్‌లలో ఆడేలా చూడాలన్నాడు. కాగా.. మరో రెండు కొత్త టీ20 లీగ్‌లు ప్రారంభం కానున్నాయి. అందులో ఒకటి యూఏఈ టీ20 లీగ్ కాగా మరొకటి సౌతాఫ్రికా టీ20 లీగ్. ఈ రెండు లీగ్స్‌లో ఇండియన్ కంపెనీలు, ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లే జట్లను తీసుకున్నాయి. మరి ఈ లీగ్‌లోనైనా ఇండియన్ క్రికెటర్లు పాల్గొనేందుకు బీసీసీఐ అనుమతి ఇస్తుందో లేదో చూడాలి. మరి బీసీసీఐకి గిల్‌క్రిస్ట్ చేసిన రిక్వెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Adam Gilchrist flags Big Bash League concerns amid rise of new T20 leagues | #Cricket #IPL #BBL https://t.co/5usA3KTO8s
— India Today Sports (@ITGDsports) July 27, 2022
ఇది కూడా చదవండి: రూ.17 కోట్లు ఇస్తామంటున్నారు.. ఆడేందుకు పర్మిషన్ ఇవ్వండి: వార్నర్