ఐపీఎల్ పుణ్యామా అని ప్రపంచ క్రికెట్‌పై ఫ్రాంచైజ్ లీగ్‌ల ప్రభావం బాగానే పడింది. ఐపీఎల్ సక్సెస్ చూసి మరిన్ని లీగ్‌లు పుట్టుకొచ్చాయి. అందులో కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాందే ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, ఇంగ్లండ్‌లో ది హండ్రెడ్ ఇలా చాలానే లీగులు ఉన్నాయి. తాజాగా మరో రెండు కొత్త లీగ్‌లు ప్రారంభం కానున్నాయి. అందులో ఒకటి యూఏఈ టీ20 లీగ్ కాగా మరొకటి సౌతాఫ్రికా టీ20 లీగ్. ఈ రెండు లీగ్స్‌లో భారత కంపెనీలు ఫ్రాంచైజ్ ఓనర్లుగా ఉన్నాయి. సౌతాఫ్రికాలోని ఆరు ఫ్రాంచైజ్‌లను పూర్తిగా ఐపీఎల్లో ఉన్న జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్‌జెయింట్స్ ఓనర్లే అక్కడ కూడా టీమ్ ఫ్రాంచైజ్‌ను దక్కించుకున్నారు. అలాగే యూఏఈ టీ20 లీగ్‌లో కోల్కత్తా నైట్‌రైడర్స్, రిలయన్స్, అదానీ గ్రూప్స్ లాంటి దిగ్గజ కంపెనీలు టీమ్ ఫ్రాంచైజ్‌ను దక్కించుకున్నాయి. ఇలాంటి పెద్దపెద్ద కంపెనీలు పాల్గొం టున్న ఈ లీగ్ కూడా ఐపీఎల్లానే ఆటగాళ్లపై డబ్బు కట్టల కుంభవృష్టి కురిపించనుంది. ఇప్పటికే ఐపీఎల్లో కోల్కత్తా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్‌ను కేకేఆర్ భారీ ధర ఆఫర్ చేసి యూఏఈలో కూడా తన టీమ్‌లోనే ఆడేందుకు ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న డేవిడ్ వార్నర్‌కు ఒక ఫ్రాంచైజ్ ఏకంగా రూ.17 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఆఫర్ నచ్చి.. యూఏఈ లీగ్‌లో ఆడేందుకు తనకు అనుమతిస్తూ నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వమని డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును కోరినట్లు తెలుస్తుంది. అయితే డేవిడ్ వార్నర్ యూఏఈ టీ20 లీగ్‌లో ఆడాలంటే ఆసీస్‌లో జరిగే బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రెండు లీగ్‌లు ఒక టైమ్‌లో జరుగుతాయి. వార్నర్‌కు బిగ్‌బాష్ లీగ్‌లో ఇచ్చే మొత్తం కంటే యూఏఈ లీగ్‌లో ఆఫర్ చేసిన ధర డబుల్. అందుకే వార్నర్ యూఏఈ లీగ్ ఆడేందుకు మొగ్గుచూపుతున్నాడు. కాగా.. తమ ఆటగాళ్ల యూఏఈ టీ20 లీగ్‌లో ఆడాలా వద్ద అనే విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇప్పుడైతే వార్నర్‌కు అనుమతి లభించకపోవచ్చు. యూఏఈ టీ20 లీగ్ జనవరిలో ప్రారంభం కానుంది. మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. ఒక్కో జట్టు 12 మంది విదేశి ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు ఉంది. దీంతో మొత్తం 72 మంది విదేశి ఆటగాళ్లు యూఏఈ టీ20 లీగ్‌లో పాల్గొననున్నారు. అలాగే ఐపీఎల్ తప్ప మరే లీగ్‌లో కూడా భారత ఆటగాళ్లు ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. మరీ యూఏఈ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల విషయంలో కూడా ఇదే పద్దతి అనుసరిస్తుందో? లేక అక్కడ ఉన్నది మన దేశపు కంపెనీలే కదా అని ఆలోచించి.. వారికి లాభాలు ఆర్జించి పెట్టేందుకు టీమిండియా ఆటగాళ్లును కూడా ఆడేందుకు అనుమతిస్తోందో? వేచి చూడాలి. మరి వార్నర్ యూఏఈ లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు దరఖాస్తు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. David Warner has been offered 17Cr to play UAE T20 LEAGUE #DavidWarner #RohitSharma #ViratKohli pic.twitter.com/U36sEjxufm — CricketCult (@CultCricket) July 28, 2022 Not only is the UAE league offering the second biggest top salaries after IPL but with six teams of 12 overseas players each there are 72 spots available to overseas players - also the second most in any league after the IPL. https://t.co/wAcVoZd1jV — Freddie Wilde (@fwildecricket) July 28, 2022