భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఐఎస్‌బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గురువారం ప్రధాని మోదీ నగరానికి వచ్చారు. గురువారం మధ్యాహ్నాం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకున్నారు. ముందుగా బీజేపీ నేతలతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం బీజేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన ప్రసంగించారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
మోదీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారు. అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ది కోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులతో పాటు ఎవరి ఆశయాలు కూడా నెరవేరడం లేదు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యింది. కేవలం ఒక కుటుంబం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగలేదు. కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి. తెలంగాణలో అధికార మార్పిడి తప్పక జరుగుతుంది. రాష్ట్రంలో బీజేపీ హవా కనిపిస్తోంది. ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చి తీరతాం. తెలంగాణ అభివృద్ధి కోసం ఎలాంటి పోరాటమైన చేస్తాం. యువతతో కలిసి అభివృద్ధి పథంలోకి నడిపిస్తాం. రాష్ట్రంలో కుటుంబ పాలన వల్ల అభివృద్ధి జరగడం లేదు’’ అంటూ మోదీ, కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు చేశారు. మోదీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.