ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలతో సంబంధం లేకుండా.. రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటాయి. ప్రతిపక్షం, అధికార పక్షం.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. పొలిటికల్ హీట్ పెంచుతూనే ఉంటారు. ఇక ఆదివారం చోటు చేసుకున్న పరిణామం.. ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇంతకు ఆ సంఘటన ఏంటంటే.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్.. ఆదివారం ఉదయం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. కుప్పం పర్యటనలో పోలీసులు చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో- ఆయనను పరామర్శించడానికే పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంటికి వచ్చారని జనసేన నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక ఈ భేటీలో ఇరువురు నాయకులు పొత్తుపై చర్చించారని.. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరిందని జోరుగా ప్రచారం సాగుతోంది. చంద్రబాబుతో జరిగిన భేటీలో.. ప్రధానంగా పొత్తలపై చర్చ జరిగిందని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీలో.. సీట్ల పంపకాలకు సంబంధించి కూడా చర్చలు జరిగాయని అంటున్నారు. అంతేకాక 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన 40 అసెంబ్లీ, అయిదు నుంచి ఎనిమిది లోక్ సభ స్థానాలను అడుగుతోందని.. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబుకు పంపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ భేటీలో పొత్తుపై ఎలాంటి చర్చలు జరగలేదని చెబుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. కుప్పంలో జరిగిన సంఘటనపై మాట్లాడేందుకు మాత్రమే చంద్రబాబును కలిశానని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన కొనసాగుతోందని పవన్ మండిపడ్డారు. చంద్రబాబుతో జరిగిన భేటీలో.. ప్రతిపక్ష నేతల హక్కులను కాలరాస్తున్న తీరు.. పెన్షన్లు తీసేయడం, రైతు సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. జీవో నంబర్-1 వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో.. తాను ముందుగా వైజాగ్‌లోనే చూశాన్నారు పవన్. రాష్ట్రంలో ఎవరు ఫ్లెక్సీలు వాడొద్దంటారు.. ఆయనకి మాత్రం ఫ్లెక్సీలు పెట్టుకుంటారు అని విమర్శించారు పవన్. రూల్స్ అందరికీ వర్తిస్తాయంటారు.. కానీ అమలులో మాత్రం అలా లేదంటూ మండి పడ్డారు. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్యల పొత్తు ఉంటుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.