మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి లీగల్ నోటీసులు పంపారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానంటూ కేటీఆర్ వెల్లడించారు. కేటీఆర్ బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపడంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విషయం ఏంటంటే? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ను ఉద్దేశిస్తూ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు. ‘మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణిస్తే కనీసం స్పందించని దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్’ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఇక దీనిపై కేటీఆర్ గత ఆదివారం వెంటనే స్పందిస్తూ.. సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. కానీ కేటీఆర్ వ్యాఖ్యలను బండి సంజయ్ అస్సలు లెక్కచేయలేదు.
ఇది కూడా చదవండి: Sajjala Ramakrishna Reddy: నారాయణకు బెయిల్.. హైకోర్టుకు వెళ్తామన్నా సజ్జల!
దీంతో ఆయన స్పందించని కారణంగా కేటీఆర్ తన న్యాయవాది ద్వారా బండి సంజయ్ కి లీగల్ నోటీసులు పంపారు. 48 గంటల్లో సంజయ్ క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తామని పేర్కొన్నారు. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.