అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిని కూల్చివేసిన ఘటన అధికార వైసీపీ, విపక్ష టీడీపీ సభ్యుల మధ్య చిచ్చు పెట్టింది. ప్రస్తుతం తాడిపత్రి రాజకీయాలు ప్రభుత్వాస్పత్రి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఆస్పత్రి కూల్చే ఆలోచన ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎలా కూల్చి వేస్తారని ప్రశ్నించారు. వైద్య సిబ్బందికి కనీస సౌకర్యాలు లేకుండా ఎలా కూల్చి వేస్తారని నిలదీశారు. శనివారం ఆస్పత్రిలో కూల్చివేతలను ఆయన పరిశీలించారు.
ఇది కూడా చదవండి: అనంతలో ఆసక్తికర సీన్.. పరిటాల శ్రీరామ్ ను ఆత్మీయంగా హత్తుకున్న జేసీ బ్రదర్!
ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘’ఓ ఎమ్మెల్యే.. నీకు చేతనైతే రేపు షెడ్ వేయించు. ప్రజల కోసం పనిచేయి. నీకు నమస్కారం పెడతాం. యువ నాయకులను వేసుకుని పల్లెల్లో తిరిగితే ఓట్లు రావు. నువ్వు పనిచేయకపోతే ప్రజలు నిన్ను ఓటు రూపంలో కొడతారు. అసలు నీకు ఈ సారి సీటు కూడా రాదులే’’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో ఆసుపత్రిని మొత్తం చెడగొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యామ్నాయంగా షెడ్లు వేయాలని.. లేకపోతే తాడిపత్రి ప్రజలంతా ఆందోళన చేస్తారని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: అనంతలో ఆసక్తికర సీన్.. పరిటాల శ్రీరామ్ ను ఆత్మీయంగా హత్తుకున్న జేసీ బ్రదర్!
తాడిపత్రి ఆసుపత్రిలో కడ్డీలు కూడా అమ్ముకున్నారని జేసీ ఆరోపించారు. ఆసుప్రతి అంబులెన్సులు కూడా సరిగా లేవన్నారు. వచ్చే 7వ తేదీ తరువాత తాడిపత్రిని స్తంభింపజేస్తామన్నారు. ఈ ఆసుపత్రిపై నాలుగు మండలాల ప్రజలు ఆధార పడిఉన్నారని.. ఇలా కూల్చేస్తా వారంతా ఎక్కడికి వెళతారని ప్రశ్నించారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: చంద్రబాబు ఇలాకలో ఎగిరిన ఎన్టీఆర్ జెండా.. సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ రచ్చ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి