ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను అమలు చేయడం మొదలు పెట్టాయి. అధికార పార్టీ ఇప్పటి వరకు తమ పాలనలో చేసిన అభివృద్ది పనుల గురించి చెబుతూ ప్రజల్లోకి వెళ్తుంటే. అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందే ఏమీ లేదని ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి రాజకీయలపై ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ఫైర్ బ్రాండ్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇలా సీరియస్ పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి..డ్యాన్స్ చేశారు. అది కూడా మాములు డ్యాన్స్ కాదు.. ఊరా మాస్ డ్యాన్స్ చేస్తూ అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.
ఏపీ రాజకీయాల్లో తాడిపత్రి నియోకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ అధికార, ప్రతిపక్షనేతల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాల్ కు ప్రతిసవాల్ నడుస్తున్నాయి. తాజాగా మరోసారి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ సంచలన కామెంట్స్ చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిని కూల్చివేసిన ఘటన అధికార వైసీపీ, విపక్ష టీడీపీ సభ్యుల మధ్య చిచ్చు పెట్టింది. ప్రస్తుతం తాడిపత్రి రాజకీయాలు ప్రభుత్వాస్పత్రి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఆస్పత్రి కూల్చే ఆలోచన ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎలా కూల్చి వేస్తారని ప్రశ్నించారు. వైద్య సిబ్బందికి కనీస సౌకర్యాలు లేకుండా ఎలా కూల్చి వేస్తారని నిలదీశారు. శనివారం ఆస్పత్రిలో కూల్చివేతలను […]
రాయలసీమ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర దృశ్యం ఆవిషృతమైంది. కక్షలతో రగిలిపోయే రెండు కుటుంబాలు స్నేహంగా మారాయి. పరిటాల శ్రీరామ్ ను జేసీ ప్రభాకర్ రెడ్డి కౌగలించుకున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. నారా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు జిల్లా సరిహద్దుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి చేరుకోగా అక్కడికి వచ్చిన శ్రీరామ్‌ను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఆలింగనం చేసుకున్నారు.. మాట్లాడుకున్నారు. ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకున్నారు. అయితే […]
సీమ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు జేసీ సోదరులు. తమ సొంత పార్టీపై ఏమాత్రం మోహమాటం లేకుండా విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమలో ప్రాజెక్ట్‌ల కంటే ముందు కార్యకర్తలను కాపాడాలని హైకమాండ్‌ను కోరారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలుగు దేశం పార్టీ మళ్లీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కార్యకర్తలు టీడీపీ నేతలను నమ్మటం లేదన్నారు.. చంద్రబాబు మేలుకోకపోతే కష్టమే […]
తాడిపత్రి మున్సిపల్ ఆఫీసును సందర్శించారు చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుకు నిరసగా ఒంగి ఒంగి దండాలు పెడుతూ అగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో కరోనా నేపథ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అధికారులందిరికీ శనివారం రోజు సమాచారం అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేతి పెద్దా రెడ్డితో సహా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో కరోనా థర్డ్ వేవ్ పట్ల ప్రజలకు […]