పెళ్లిబంధంతో ఒక్కటై.. కడదాకా ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ సంతోషంగా ఉండే దంపతులకు ఒక్కోసారి ఆరోగ్య సమస్యలు శాపంగా మాకి.. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు తనువు చాలించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రులను అద్బుతంగా తీర్చి దిద్దామని.. మెరుగైన వసతులను ఏర్పాటు చేశామని.. ఎప్పటికప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉంటారని ప్రభుత్వాలు చెబుతుంటాయి.. కానీ రోగులు మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిత్యం ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు.
ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో భయానక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అక్కడ భద్రతా లోపం సుస్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటనలు గురించి విన్నాం. తాజాగా మరో ఆసుపత్రిలో..
ఈ రోజుల్లో ఏదైనా రోగం వస్తే .. నగరంలో వెలిసిన బడా ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిందే. ఇక ఆసుపత్రుల్లోకి అడుగు పెట్టామంటే అవసరం ఉన్నా లేకున్నా.. స్కానింగ్, బాడీ చెకప్ అని, ఈసీజీ, బ్లడ్ పరీక్షలు వంటి చేయించుకోవాలి. ఇవి తడిచి మోపెడు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూడాల్సిన పరిస్థితి. అయితే.. అక్కడ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయి.
గత ఏడాది విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువతిని 30 గంటల పాటు గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ప్రభుత్వ ఆసుపత్రులన్న పేరుకే గానీ రోగులను పట్టించుకునే వారే ఉండరు. వైద్యం కోసం వెళ్లిన రోగిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ లేక కాళ్ళు పట్టుకుని లాక్కెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
సమాజంలో పని చేసుకోవడానికి ఎన్ని వృత్తులున్నా వాటిల్లో వైద్యవృత్తి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. చావుబతుకుల్లో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడాలంటే అది కేవలం డాక్టర్లే చేయగలరు. ఒకరికి ప్రాణం పోయగలరు కాబట్టే వారిని రోగులు దేవుళ్లుగా చూస్తారు. అలాంటి డాక్టర్లు చికిత్స చేయడం ప్రారంభించి మధ్యలోనే చేతులెత్తేస్తే రోగుల పరిస్థితేంటి? చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్వాకం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఓ పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ చేస్తూ మధ్యలోనే చికిత్సను ఆపేయడం చర్చనీయాంశంగా మారింది. యాదమరి మండలం దవళాయిపల్లికి […]
ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమనేది తరచూ వార్తల్లో చూస్తుంటాం. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కాదు కానీ కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కొంతమంది సిబ్బంది రోగుల పట్ల పరుష పదజాలంతో విరుచుకుపడుతుంటారు. ముఖ్యంగా పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి పురుడు పోస్తూనే.. బూతులతో తిడతారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి ఇది అనుభవం అయ్యే ఉంటుంది. ఇలాంటి ఘటనే ఒక గర్భిణీకి ఎదురయ్యింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళ ప్రభుత్వాసుపత్రికి […]
సాధారణంగా పుట్టిన రోజు వేడుకలు అంటే.. కొత్త బట్టలు ధరించడం, స్కూల్లో ఫ్రెండ్స్‌కి చాక్లెట్స్ పంచడం, కేక్ కట్ చేయడం.. కుటుంబంతో కలిసి సరాదాగా బయటకు వెళ్లడం వంటివి చేస్తాము. అయితే మారుతున్న కాలంతో పాటు వేడుకల నిర్వహణ తీరు కూడా మారుతోంది. ఈ మార్పు బాగుంటే సరే.. కానీ ట్రెండ్ పేరుతో వెర్రి వేషాలు వేస్తున్నారు కొందరు. శుభామా అని పుట్టినరోజు వేళ.. వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. బర్త్ డే పార్టీ అంటూ.. అర్థరాత్రి రోడ్ల […]
దేశంలో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నా.. కొన్ని చోట్ల మాత్రం విషాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వైద్యుల నిర్లక్ష్య, సిబ్బంది లంచాలకు ఎగబడటం.. సరైన సమయానికి అంబులెన్సు లేకపోవడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల తమకు సంబంధించిన వారు మరణిస్తే.. మృతదేహాన్ని రిక్షా, సైకిల్ లేదా భుజాన వేసుకొని వెళ్లిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ కొడుకు తన తల్లి చనిపోతే.. ప్రభుత్వ అంబులెన్స్ లేకపోవడం వల్ల మృతదేహంతో 80 […]