ఇటీవల కాలంలో హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో మాత్రం ఓ స్టార్ హీరో భార్యది. ప్రస్తుతం ఆమె పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.
ఈ ఫోటోలో ఉన్న చిన్నపాపను గుర్తు పెట్టారా? తండ్రి చాటు తనయలా చక్కటి స్మైల్ తో ఉన్న ఈమె పేరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు. ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. షార్ట్ హెయిర్‌తో ఫోటోకు ఫోజులిస్తున్న ఆమె ఇప్పుడు ఓ స్టార్ హీరోకు భార్య. చూడటానికి టామ్ బాయ్ లా ఉన్న అమ్మాయి.. తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఇప్పటికైనా ఆమెను గుర్తు పట్టారా.. పోనీ క్లూస్ ఇవ్వమంటారా.. అయినా గుర్తు పట్టలేం చెప్పేయమంటారా..? అయితే ఆమె పేరు రివీల్ చేస్తున్నాం శ్రద్ధగా చదవండి
సినిమా, రాజకీయం రెండూ వేర్వేరు అయినప్పటికీ.. వీటి మధ్య అవినావభావ సంబంధం ఉంటుంది. రాజకీయ నేపథ్య కుటుంబం నుండి అడుగుపెట్టిన ఈ చిన్నది.. ఇప్పుడు పూర్తిగా సినిమా ప్రపంచంగా భావించే కుటుంబంలోకి కోడలిగా వెళ్లింది. ఆమె మరెవరో కాదూ భూమా నాగిరెడ్డి ముద్దుల తనయ భూమా నాగ మౌనిక. దివంగత టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డి, శోభా రెడ్డి రెండవ కుమార్తెనే ఈ మౌనిక. ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ ఈమెకు సోదరి. మంచు మనోజ్‌ను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది మౌనిక. వీరిద్దరికీ ఇది రెండవ వివాహమే. మంచు కుటుంబానికి, భూమా కుటుంబానికి ఎప్పటి నుండో మంచి సంబంధాలున్నాయి. అవి ఇప్పుడు బంధుత్వంగా మారాయి.
మౌనిక ఆస్ట్రేలియాలోని స్విన్బర్న్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో బ్రాడ్ కాస్టింగ్, జర్నలిజంలో పట్టాను పొందారు. చదువులు పూర్తయ్యాక స్వస్థలం ఆళ్లగడ్డకు తిరిగి వచ్చారు. 2016లో బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్తతో ఆమెకు వివాహం జరిగింది. వీరికి 2018లో ధైరవ్ రెడ్డి జన్మించాడు. అనంతరం మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. అటు మంచు మనోజ్ కూడా ప్రణతితో విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల కొంత కాలంగా మంచు మనోజ్ తో ఆమె రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం చేస్తూ వీరిద్దరూ మార్చి 3న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.