ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ నేతలు.. ఏకంగా స్పీకర్‌తోనే దురుసుగా ప్రవర్తించారు. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేతలు సభ సజావుగా సాగకుండా అడ్డుకోవడానికి శత విధాల ప్రయత్నించారు. ఇక నేడు టీడీపీ నేతలు ఓ అడుగు ముందుకు వేసి.. అన్ని హద్దులు దాటేశారు. సభాకార్యకలాపాలను అడ్డుకోవడమే కాక.. ఏకంగా స్పీకర్ తమ్మినేని మీద దాడి చేసేందుకు యత్నించారు. అడ్డుకోబోయిన అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఏపీ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజులో భాగంగా సోమవారం సభ సమావేశం అయ్యింది. అయితే ప్రశ్నోత్తరాల సమయం నుంచే టీడీపీ నేతలు.. సభలో గందరగోళం సృష్టించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఏకంగా స్పీకర్ తమ్మినేనితో దౌర్యన్యంగా ప్రవర్తించడమే కాక.. ఆయనపై దాడికి కూడా పాల్పడ్డారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుమట్టి నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొండేపి టీడీపీ ఎస్సీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి.. స్పీకర్ మీదకు పేపర్లు చించి విసిరేశారు. స్పీకర్ చైర్ ఎక్కి.. ఆయన ముఖం మీద ప్లకార్డులు అడ్డుగా పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. సభా సమయాన్ని వృథా చేయడంపై స్పీకర్ సీరియస్ అయ్యారు.
ఈ క్రమంలో స్పీకర్‌కు రక్షణ కల్పించడం కోసం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆయన పోడియం వద్దకు చేరుకున్నారు. వారిపై కూడా టీడీపీ నేతలు దాడికి దిగారు. ఈ క్రమంలో సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామికి మధ్య ఘర్షణ జరిగింది. సుధాకర్ బాబుపై.. టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దాడి చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గాయపడ్డారు. అంతేకాక వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి నెట్టేయడంతో.. ఆయన కిందపడబోయారు. డోలా వీరాంజనేయస్వామి.. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని సైతం దూషించారు. సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. స్పీకర్ సభను వాయిదా వేశారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.