Anil Kumar Yadav: మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం పంపలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అయినప్పటికి, ఆయనను తన నియోజకవర్గంలోకి పిలుస్తానని చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాకాణి తనకు ఎంత గౌరవం ఇచ్చారో.. అంతకు రెండు రెట్లు ఎక్కువ గౌరవం ఇస్తానన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వైసీపీ ఒక కుటుంబం వంటిది. ఏవైనా గొడవలుంటే కూర్చొని మాట్లాడుకుంటాం.
ముఖ్యమంత్రి జగన్ మాకు దైవంతో సమానం. ఆయన సైనికుడిగా పని చేయడమే మాకు గౌరవం. మంత్రి పదవి ఉన్నా లేకున్నా మేము తగ్గము. జగన్‌ను మరోసారి సీఎంను చేసి, మరోసారి మంత్రులమవుతాము. మంత్రి పదవి దక్కని అసంతృప్తి తండ్రి మీద కొడుకుకు ఉండే అలకలాంటిది. రెండ్రోజుల్లో సర్దుకుంటుంది’’ అని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆ కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న పవన్ కల్యాణ్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.