ఏపీలో వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. విపక్షాలపై ఆయన చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలపై తనదైన స్టైల్లో విరుచుకుపడే వైసీపీ నేతల్లో కొడాలి నాని స్టైలే వేరు.. అందుకే ఆయనను ఫైర్ బ్రాండ్ అంటారు. అసెంబ్లీ, బహింరంగ సభలు, ప్రెస్ మీట్స్.. ప్లేస్ ఎక్కడైనా.. వేదిక ఏదైనా తనదైన మాటలతో ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతుంటారు. తాజాగా కొడాలి నాని అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని.. ఆయన క్యాన్సర్ భారిన పడ్డారని గత రెండు రోజులుగా పలు మీడియాలలో ప్రచారం జరుగుతుంది. తాజాగా మీడియాలో వస్తున్న రూమర్స్ పై కొడాలి నాని స్పందించారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని క్యాన్సర్ భారిన పడ్డారు అంటూ గత రెండు రోజులుగా పలు మీడియాల్లో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ఎలాంటి క్యాన్సర్ లేదు.. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఐటీడీపీ నాపై తప్పుడు ప్రచారం చేస్తుంది.. చంద్రబాబు రాజకీయాల నుంచి ఇంటికి పంపించేంతవరకు నేను భూమ్మీదనే ఉంటాను. కొంతమంది శునకానందం కోసం నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. ఇది ముమ్మాటికి దిగజారుడు తనానికి నిదర్శనం. ధైర్యంగా ఎన్నికల్లో ఎదుర్కొనలేక, తప్పుడు రాతలు రాస్తూ.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ.. దిగజారిపోతున్న దిష్టచతుష్టయం ఇలాంటి ఆరోపనలు చేస్తుంది.. చంద్రబాబు, లోకేష్ దమ్ముంటే గుడివాడ రావాలి’ అంటూ సవాల్ విసిరారు.
ఈ సందర్బంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ.. కొడాలి నానిపై ఎంత దుష్ప్రాచారం చేసినా ఎవర్వూ నమ్మరని.. ఆయన ఏ హాస్పిటల్ లో జాయిన్ కాలేదని అన్నారు. గత వారం రోజులగా ఆయన గుడివాడలోనే ఉన్నారని.. కుటుంబ సభ్యులు విదేశాల నుండి వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకునే క్రమంలో నిన్న హైదరాబాద్ వెళ్ళారని తెలిపారు. ఆదివారం బాబ్జి గారి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొండలమ్మ వారికి ఆషాడ సారే కూడా అందించారని తెలిపారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని వ్యక్తిగత కార్యక్రమంలో ఉన్నారని.. సాయంత్రం వరకు గుడివాడకు వచ్చేస్తారని అన్నారు.