మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో పాల్గొనబోయే పార్టీలు అప్పుడే ప్రయత్నాలను మొదలుపెట్టాయి. దీనిలో భాగంగా జనసేనా అధినేత వారాహి యాత్రను చేపట్టారు. ఏళూరులో జరిగిన సభలో వాలంటీర్ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంఎల్ఎ ఆళ్ల వినూత్నంగా నిరసన తెలిపారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. విమర్షలు, ప్రతివిమర్షలతో రాజకీయ నాయకులు రాష్ట్రంలో హీట్ పుట్టిస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనబోయే పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఏళూరులో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థపై విమర్షలు గుప్పించారు. దీంతో పవన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. పవన్ వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు రెండు రోజుల నుంచి రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మహిళా వాలంటీర్ కాళ్లు కడిగి ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసిపి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత, ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషిచేస్తోంది. సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. కాగా వాలంటీర్ వ్యవస్థపై జనసేనా అధినేత విమర్షలు గుప్పించారు. దీంతో వాలంటీర్లు పవన్ పై భగ్గుమన్నారు. క్షమాపణలు చెప్పాలంటూ నిరసనకు దిగారు. అయితే దీనిపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. తన నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల మండలం ఈమని లో వాలంటీర్ జెట్టి రజిత కాళ్లను కడిగి నమస్కరించారు. శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుందని అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు తగదని ఎంఎల్ఎ ఆళ్ల తెలిపారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.