తనను నియోజకవర్గం నుంచి తరిమికొడతాం అన్న వైసీపీ నేతలకు సవాల్ విసురుతూ.. గురువారం ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని, ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరాడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్. దాంతో అక్కడ వాతావారణం ఒక్కసారిగా హీటెక్కింది.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా అక్కడి రాజకీయాలు సాగుతున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నెల్లూరు నగరం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశాడు. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనిల్ మరోసారి అవకాశం దక్కకపోవడంతో.. ప్రస్తుతం నియోజకవర్గానికే పరిమితం అయ్యాడు. ఇక ప్రత్యుర్థుల మీద విరుచుకుపడటంలో.. ఘాటు వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు అనిల్ కుమార్. ప్రభుత్వాన్ని కానీ.. సీఎం జగన్‌ని […]
రాజకీయాలకు దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆ మధ్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించి విమర్శలకు గురయ్యారు. బాలకృష్ణ కూడా దీనిపై స్పందించి విమర్శల పాలయ్యారు. బాలకృష్ణ కామెంట్స్ కి వైసీపీ నాయకులు ధీటైన కౌంటర్లు ఇచ్చారు. వైసీపీ మంత్రులు, నేతలు లాజికల్ గా సమాధానమిస్తూ బాలకృష్ణపై కౌంటర్లు వేశారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నందమూరి కుటుంబ […]
నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్.. తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే రంగంలోకి దిగి.. వారికి చుక్కలు చూపిస్తాడు. అంతేకాక వర్తమాన అంశాలపై కూడా తనదైన శైలీలో స్పందిస్తుంటాడు బండ్ల గణేష్. ఈ క్రమంలో ఆయన చేసే ట్వీట్లు కొన్నిసార్లు వివాదాలను క్రియేట్ చేస్తుంటాయి. కానీ బండ్ల గణేష్ మాత్రం డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తాడు. ఈ […]
Anil Kumar Yadav: ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఎన్టీఆర్ వారసులైన కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ట్వీట్ల ద్వారా స్పందించారు.. ‘‘1986లో విజయవాడలో మెడికల్ యూనివర్సిటీ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యని అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు మహావిద్యాలయానికి అంకురార్పణ చేశారు. […]
లోన్ యాప్స్.. గత కొంతకాలంగా ఈ పేరు సోషల్ మీడియా, మీడియా అంతా చక్కర్లు కొడుతోంది. వ్యక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇచ్చిన మొత్తానికి వడ్డీలు, చక్ర వడ్డీలు, భూచక్ర వడ్డీలు వేస్తూ పీల్చి పిప్పి చేస్తున్నారు. కట్టలేమంటే బంధువులు, మిత్రులకు వారి వివరాలను పంపుతూ పరువు బజారుకీడుస్తున్నారు. వీరి ఆగడాలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వేధింపుల సెగ మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం తాకింది. మాజీ మంత్రి అనిల్ […]
Anil Kumar Yadav: మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం పంపలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అయినప్పటికి, ఆయనను తన నియోజకవర్గంలోకి పిలుస్తానని చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాకాణి తనకు ఎంత గౌరవం ఇచ్చారో.. అంతకు రెండు రెట్లు ఎక్కువ గౌరవం ఇస్తానన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వైసీపీ ఒక కుటుంబం వంటిది. ఏవైనా గొడవలుంటే కూర్చొని మాట్లాడుకుంటాం. ముఖ్యమంత్రి జగన్ మాకు […]
ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై కొందరు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం.. నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా కొందరు పక్క చూపులు చూస్తున్నారనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఇక నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు అంశంమై ప్రభుత్వంపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆనం తీరు ఇలా ఉంటే.. ఇదే జిల్లాకు చెందిన మరో నేత వైఖరి […]
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో సోమవారం ఉదయం కన్నుమూశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన హఠాన్మరణం.. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు, అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది. ఆయన మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. సొంత అన్నను కోల్పోయినట్లు ఉందని అదే జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భావోద్వేగంగా మాట్లాడారు. అయితే […]