సెల్ఫ్ మేడ్ స్టార్‌గా మాస్ మహరాజ్ రవితేజకు ఎంతో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో రవితేజ రూటే సెపరేట్ అంటారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో రవితేజ జోరు మీదున్నాడు. చేతిలో ఐదు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ‘ఒక్క ఛాన్స్’ అంటూ ఇండస్ట్రీకి వచ్చిన రవితేజ.. కొత్త వారికి అవకాశమివ్వడంలో ముందుంటాడు.
రవితేజ లీడ్ రోల్లో నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా జులై 29న విడుదలై యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ప్రభుత్వాధికారిగా రవితేజ నటించాడు. ఆ సినిమా థియేటర్లో అంతగా రాణించకపోయినా.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడవుతుందా అని అంతా ఎదురుచూశారు. అయితే ఆ అనౌన్సమెంట్ కూడా రానే వచ్చింది. సినిమా బృందం అధికారిక డేట్ ని రివీల్ చేశారు.
ఈ సినిమా సెప్టెంబర్ 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి థియేటర్లో ఆకట్టుకోకపోయినా.. ఓటీటీలో ఇరగదీసిన సినిమాలు చాలానే ఉన్నాయి. రామారావు ఆన్ డ్యూటీ కూడా అలాంటి సినిమా అవుతుందంటున్నారు.
ఇంక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. సుధీర్ వర్మ తెరకెక్కించిన ‘రావణాసుర’ మూవీ సెప్టెంబర్ 30 థియేటర్లలో విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యలోనూ రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంక ధమాకా, స్టువర్టుపురం గజదొంగ పాత్ర ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కూడా షూటింగ్ జరుగుతోంది. మట్టికుస్తీ అనే మరో సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.