లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్‘. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం నుండి ఇటీవలే మొదటి భాగం ‘పొన్నియన్ సెల్వన్ 1’ రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. రిలీజైన పాతిక రోజుల్లోనే పొన్నియన్ సెల్వన్ వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ తో పాటు మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం సంయుక్తంగా నిర్మించారు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్స్ చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవి, శోభిత ప్రధాన పాత్రలలో నటించారు. అయితే.. తెలుగు విషయానికి వస్తే.. పొన్నియన్ సెల్వన్ ఓ మోస్తరు చిత్రంగా టాక్ తెచ్చుకుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తమిళనాడులో మాత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో సినిమా థియేట్రికల్ రిలీజై నెలరోజులు పూర్తవకుండానే ఓటిటిలో రిలీజ్ అవ్వడం గమనార్హం.
పొన్నియన్ సెల్వన్ ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే.. అనౌన్స్ చేసిన డేట్ కి వారం ముందే సినిమాను రెంట్ పే విధానంలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అంటే.. నవంబర్ 4 లోపే చూడాలనుకునేవారు సినిమాను డబ్బులు చెల్లించి చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా అమెజాన్ వారు రిలీజ్ చేశారు. మరి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. ఓటిటి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక వచ్చే ఏడాది పొన్నియన్ సెల్వన్ 2 తెరమీదకు రానుందని సమాచారం.
presenting the much awaited, larger than life, historical action-drama
#PS1onPrime, rent to watch now!
Coming to Prime on Nov 4#ManiRatnam @arrahman @MadrasTalkies_ @LycaProductions@tipsofficial pic.twitter.com/Cq34q7zdD7— prime video IN (@PrimeVideoIN) October 28, 2022