అన్ స్టాపబుల్ 2.. ఓటీటీల్లోనే ఈ టాక్ షో ఒక సెన్సేషన్ అని చెప్పడంలో సందేహం లేదు. బాలయ్య వ్యాఖ్యతగా ప్రారంభమైన ఈ షో దిగ్విజయంగా ఒక సీజన్ పూర్తి చేసుకుని రెండో సీజన్ రన్ అవుతోంది. రెండో సీజన్ లో కూడా ఎంతో మంది సెలబ్రిటీలతో బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. కానీ, ఇప్పుడు రాబోతున్న ఎపిసోడ్ మీదే అందరి దృష్టి నెలకొని ఉంది. ఎందుకంటే ఇటీవల పవన్ కల్యాణ్ ని బాలయ్య ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 2 రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
బాలయ్య- పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని పవన్ ఫ్యాన్స్ మాత్రమేకాదు.. తెలుగు ప్రేక్షకులు, రాజకీయ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఎన్నో ఎదురుచూపుల తర్వాత పవన్ ఎపిసోడ్ మీద ఆహా టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు ఎపిసోడ్- 1 స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఆహా టీమ్ గ్లింప్స్, ప్రోమోలు, పోస్టర్లు, కామన్ డీపీలు కూడా విడుదల చేసి ఫుల్ పబ్లిసిటీ చేస్తోంది. పైగా ప్రభాస్ ఎపిసోడ్ సమయం జరిగిన విధంగా క్రాష్ కాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నామని ప్రకటించారు.
తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించి మరో ప్రోమోని విడుదల చేశారు. ఆ ప్రోమోలో బాలయ్య- పవన్ కల్యాణ్ ని కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడుగుతూ కనిపించారు. ట్రూ- ఫాల్స్ అనే ఒక బోర్డు ఇచ్చి.. ప్రశ్నకు నిజమైతే ట్రూ అని, అబద్ధం అయితే ఫాల్స్ అని చూపించాలి. తమ్ముడు సినిమా సమయంలో జరిగిన స్టంట్స్ గురించి బాలయ్య ఓ ఆసక్తికర ప్రశ్న సంధించారు. ‘తమ్ముడు సినిమాలో జరిగిన స్టంట్స్ అన్నీ డూప్ తో చేసినవి అంటగా?’ అని బాలయ్య ప్రశ్నించారు. అందుకు పవన్ నవ్వుతూ అటు ట్రూ అని, ఇటు ఫాల్స్ అని కాకుండా బోర్డుని తిప్పుతూ నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.
అంతేకాకుండా తమ్ముడు సినిమాలోనే ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్ లో ఒక పోల్ ని కొట్టే సీన్ ఉంటుంది. ఆ సీన్ గురించి పవన్ మరోసారి గుర్తుచేసుకున్నారు. “ఆ సాంగ్ లో ఒక పోల్ ని కొట్టే సీన్ ఉంటుంది. యాక్షన్ అనగానే నేను పోల్ ని కొట్టడం స్టార్ట్ చేశాను. చూస్తే చేతికి రక్తం కారుతూ ఉంది. కట్ చెప్పిన తర్వాత ఆ ఆర్ట్ డైరెక్టర్ ఎవరో రమ్మని చెప్పండి అని చెప్పాను” అంటూ పవన్ అప్పటి విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ కోసం పవన్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.