ఓటిటి ప్లాట్ ఫాములు వచ్చాక అన్ని భాషల సినిమాలను జనాలకు దగ్గర చేసేశాయి. ఓవైపు థియేట్రికల్ సినిమాలు చూస్తూనే.. మరోవైపు ఇంట్లో కూర్చుని ఓటిటిలో సినిమాలు. సిరీసులు ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఏ భాషలో సినిమాలైనా ఇప్పుడు అందుబాటులో ఉన్న భాషల్లోకి డబ్ అవుతున్నాయి. థియేటర్లలో విడుదలైన సినిమాలు కూడా ఎలాగో కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాబట్టి.. ఏ విధంగా చూసుకున్నా ప్రేక్షకులకు వినోదం మాత్రం ఎప్పుడూ లభిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా 18 సినిమాలు రేపు ఒక్కరోజే అంటే.. నవంబర్ 25న ఓటిటి రిలీజ్ కి రెడీ అయిపోయాయి. మరి ఆ సినిమాలు/సిరీస్ లేంటో చూద్దాం!