టాలీవుడ్ యంగ్ హీరోలలో హిట్స్, ప్లాప్స్ పక్కనపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్న యువహీరో కిరణ్ అబ్బవరం. మొదటి రెండు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఈ ఏడాది ఇప్పటివరకే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సెబాస్టియన్, సమ్మతమే సినిమాల తర్వాత రీసెంట్ గా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమా రిలీజ్ చేశాడు. కానీ.. ముందు రెండు సినిమాల మాదిరే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్ కు ముందు సాంగ్స్, ట్రైలర్ తో మోస్తరు అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా.. కలెక్షన్స్ పరంగాను మ్యాజిక్ చేయలేకపోయిందట.
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ శ్రీధర్ గాదె కాంబినేషన్ లో రెండో మూవీగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని తెరమీదకు వచ్చింది. మొదటి ప్రయత్నం ఫలించినా.. రెండో ప్రయత్నం నిరాశ పరచడంతో తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ పెద్ద కూతురు కోడి దివ్యదీప్తి నిర్మించింది. ఈ సినిమాతో సంజన ఆనంద్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది. అయితే.. ఏ సినిమా అయినా విడుదలైన కొద్దిరోజులకు ఓటిటిలోకి రావాల్సిందే కదా.. ఇప్పుడు ఈ నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ కూడా ఓటిటి రిలీజ్ కి రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది.
కిరణ్ అబ్బవరం నుండి ఈ ఏడాది వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించలేకపోవడం గమనార్హం. అదీగాక ఈ నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీకి స్వయంగా తానే కథ, మాటలు అందించడం విశేషం. ఇదిలా ఉండగా.. నేను మీకు బాగా కావాల్సిన వాడిని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఇక దసరా తర్వాత.. దీపావళికి పదిరోజుల ముందు అంటే.. అక్టోబర్ 13 నుండి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మరి కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆడకపోయినా.. ఓటిటిలో గ్రాండ్ సక్సెస్ అవుతుంటాయి. ఈ చిత్రం అలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.
Meeru anukoni undaru, nenu meeku baaga kavalisinavaadini ani. #NMBKVOnAHA Premieres on Oct 13#nenumeekubaagakavalsinavadini @Kiran_Abbavaram @itssanjanaanand #SonuThakur #Manisharma @KodiDivyaaEnt pic.twitter.com/A6VHorTCzU
— ahavideoin (@ahavideoIN) October 10, 2022