ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ ఎవరంటే మాత్రం శ్రీలీలే. ఈ డ్యాన్స్ సెన్సేషన్ వరుసగా ఆఫర్లతో దూసుకెళుతుంది ఈ పటాసు పిల్ల. ఇప్పుడు ఏ అగ్ర హీరో ఆప్షన్ శ్రీలీలే అయ్యింది.శాండీవుడ్ నుండి ఉవ్వెత్తున ఎగసి పడింది..ఈ అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పుడు మరో బిగ్ ఆఫర్..
ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ ఎవరంటే మాత్రం శ్రీలీలే. వరుసగా ఆఫర్లతో దూసుకెళుతుంది ఈ పటాసు పిల్ల. సమంత, తమన్నా, కాజల్, రకుల్ ప్రీత్ వంటి స్టార్ నటీమణులు బాలీవుడ్ వైపు లేదా లేడీ ఓరియెంట్ చిత్రాల వైపు మొగ్గు చూపుతుంటే.. అవకాశాలు ఈ డ్యాన్స్ సెన్సేషన్ వైపు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఏ అగ్ర హీరో ఆప్షన్ శ్రీలీలే అయ్యింది. శాండీవుడ్ నుండి ఉవ్వెత్తున ఎగసి పడింది..ఈ అచ్చ తెలుగు అమ్మాయి. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరపైకి అడుగుపెట్టిన ఈ చిన్నది తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఇక ఆమె డ్యాన్సుల గురించి చెప్పనక్కర్లేదు. తర్వాత వచ్చిన ధమాకాతో ఆమె రేంజ్ స్టార్ హీరోయిన్ హోదాకు చేరింది.
బాలకృష్ణతో భగవంత్ కేసరి, పవన్ కళ్యాణ్ ఉస్తాద్, మహేష్ గుంటూరు కారం, రామ్ పోతినేని, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవర కొండ, నితిన్ సినిమాలతో ఆమె కాల్ షీట్స్ నిండిపోయాయి. వీటితో పాటు మరికొన్ని స్ట్రిప్టులు కూడా వింటుందని వినికిడి. షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు పుట్టిన రోజు నేడు. ఈ అమ్మడు ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్టును పటాయించినట్లు తెలుస్తుంది. అదే అల్లు అర్జున్ సరసన నటించబోయే లక్కీ చాన్స్ కొట్టేసింది. ఆమె బర్త్ డేను పురస్కరించుకుని ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. అల్లు అర్జున్ సంకనెక్కి కూర్చున్న శ్రీలీల ఫోటోను రివీల్ చేస్తూ.. అతి పెద్ద మూవీ పండుగ చేసుకుందామంటూ ఊరిస్తుంది.
‘అతడు ఐకానిక్ (అల్లు అర్జున్), శ్రీలీల కలలరాణి. వీళ్లిద్దరూ కలిసి సెప్ట్ వేస్తే బొమ్మ బ్లాక్ బస్టరే. ఆహా ఒరిజనల్ కోసం పనిచేయబోతుంది. అతి పెద్ద ‘మూవీ’ పండుగ చేసుకుందామా? గెట్ రెడీ టూ ఎంటర్‌టైన్ మెంట్ సునామీ’ అంటూ ట్వీట్ చేసింది. అయితే అది ఓటీటీ సినిమానా లేదా వెబ్ సిరీస్సా అనేది కన్ఫమ్ చేయలేదు. దీన్ని త్రివిక్రమ్ తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టెప్ కోసం వెయిటింగ్, క్లాసైనా, మాసైనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరు డ్యాన్స్ తో కుమ్మేయడం ఖాయం. ఈ న్యూస్ ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీని ఆసక్తిని రేపుతుంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో నటిస్తుందంటే మెగా కౌంపాండ్ లోకి అడుగుపెట్టినట్లే అంటూ ఫిలిమ్ ఇండస్ట్రీలో టాక్. ఇక మెగా ఫ్యామిలీ హీరోల నుండి కూడా ఆఫర్లు రావడం పక్కా అంటున్నారు. ఇది పెద్ద ప్లానే. మరీ వెబ్ సిరీసా లేక సినిమా.. ఏదీ అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
He is Iconic ⭐she is dreamy 💃. Veellu kalisi steppeste bomma blockbuster e🔥. Presenting @sreeleela14, our heroine for next aha Original…
Athi pedda ‘Movie’ Panduga cheskundama..?
Get ready for entertainment ‘tsunami’ 🎬🌊#AAtakesoverAha @alluarjun pic.twitter.com/7EK4DkbZT0— ahavideoin (@ahavideoIN) June 14, 2023