సెకండ్ ఇన్నింగ్స్ లో నందమూరి కల్యాణ్ రామ్ బింబిసార సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత అమిగోస్ అని వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
నందమూరి కల్యాణ్ రామ్ కొంత గ్యాప్ తర్వాత వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో బింబిసార లాంటి పాన్ ఇండియా హిట్ కొట్టడం అందరినీ ఆనందానికి గురి చేసింది. తనలో ఇంకా సత్తా అలాగే ఉంది అని కల్యాణ్ రామ్ నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో కల్యాణ్ రామ్ ప్రేక్షకులను పలకరించాడు. అమిగోస్ పేరిట ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఈ సినిమాలో ఒకేలా ఉండే ముగ్గురు విభిన్న వ్యక్తుల పాత్రల్లో కల్యాణ్ రామ్ సందడి చేశాడు. ఈ సినిమాకి కాస్త మిక్స్ డ్ టాక్ అయితే వచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా అంతగా ఆకట్టుకోలేదని టాక్ వచ్చింది.
అయితే ఈ సినిమాని థియేటర్లలో చాలా మంది మిస్ అయ్యారు. థియేటర్లలో చూడకపోయినా కూడా ఓటీటీలోకి ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనే ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఇన్నిరోజులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై కేవలం రూమర్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఈ అమిగోస్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో కల్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానున్నట్లు అప్ డేట్ అయితే ఇచ్చారు. ఓటీటీలో ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.