‘డెవిల్’ గ్లింప్స్‌లో, ‘మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.. మొదడులో ఉన్న ఆలోచన బయట పడకూడదు.. అదే గూఢచారికి ఉండవల్సిన ముఖ్య లక్షణం’ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.
నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ స్టోరీస్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకాభిమానులకు తనలోని నటుడిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలని తాపత్రయపడుతూ.. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ సాగిపోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. తాత స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేశాడు. ‘అతనొక్కడే’, ‘హరేరామ్’, ‘పటాస్’, ‘బింబిసార’ వంటి విజయవంతమైన చిత్రాలతో అలరించిన కళ్యాణ్ రామ్ పుట్టినరోజు నేడు (జూలై 5). ‘బింబిసార’ తో బ్లాక్ బస్టర్ కొట్టి, ‘అమిగోస్’ వంటి ప్రయోగాత్మక చిత్రంతో ఆకట్టుకున్నాడు.
త్వరలో ‘డెవిల్’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ మెయిన్ లీడ్స్‌గా.. నవీన్ మేడారం దర్శకత్వంలో, దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్న పీరియడ్ యాక్షన్ ఫిలిం ‘డెవిల్ – ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ (Devil-The British Secret Agent). కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ శ్రీకాంత్ విస్సా అందించాడు. కళ్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం నిడివి గల ఈ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
‘వీడు చెప్పే దానికి, చేసే దానికి, ఆలోచించే దానికి అసలు సంబంధం ఉండదేంటి సార్’ అంటూ కథానాయకుడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ‘మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.. మొదడులో ఉన్న ఆలోచన బయట పడకూడదు.. అదే గూఢచారికి ఉండవల్సిన ముఖ్య లక్షణం’ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. తన రోల్, బాడీ లాంగ్వేజ్, గెటప్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి.