ఈ మధ్యకాలంలో ఓటిటి స్ట్రీమింగ్ సినిమాలకు ఆదరణ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో సినీ ప్రేక్షకులందరూ థియేటర్స్ లో కంటే ఓటిటి స్ట్రీమింగ్ కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓటిటి ఆడియెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలను అసలు వదలడం లేదు. రీసెంట్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘హిట్ 2‘. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఈ సినిమా.. డిసెంబర్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తో పాటు కలెక్షన్స్ పరంగాను లాభాలను గడించింది. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన హిట్ 2 మూవీ.. విశ్వక్ సేన్ ‘హిట్'(2020) మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది.
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ హిట్ సిరీస్ లను రూపొందించాడు. అయితే.. హిట్ సిరీస్ లు మినిమమ్ 7 ఉంటాయని ఇటీవలే క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. ఆల్రెడీ వరుసగా హిట్స్ లో ఉన్న అడివి శేష్ కి.. హిట్ 2 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ పడ్డాయని చెప్పాలి. గతేడాది మేజర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హిట్ 2 తో మరో పెద్ద హిట్ ఖాతాలో వేసుకొని తన హిట్స్ సీక్వెన్స్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. హిట్ 2 సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు.. ఓటిటిలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఓటిటి సంస్థ ఆడియెన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.
హిట్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ మోస్ట్ అవైటింగ్ సినిమాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా న్యూ ఇయర్ సందర్భంగా ఓటిటి రిలీజ్ చేసేసింది. కానీ, ఇక్కడే అమెజాన్ ప్రైమ్ వారు ఓ కండిషన్ పెట్టారు. ప్రెజెంట్ ఈ సినిమాని చూడాలంటే.. రెంట్ పద్దతిలో అందుబాటులో ఉంచింది. రూ. 129 చెల్లించి హిట్ 2ని ఇప్పుడు చూడవచ్చు. అయితే.. జనవరి 13వ తేదీ నుండి మాత్రం సినిమాని ఫ్రీగా చూసేయొచ్చని సమాచారం. కాగా.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్, సుహాస్, రావు రమేష్ కీలకపాత్రలలో నటించారు. ఇక రానున్న హిట్ 3లో నాని హీరోగా నటించనున్న సంగతి విదితమే. మరి హిట్ 2 మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Hit2 Now on Rent in @primevideoin @AdiviSesh @NameisNani pic.twitter.com/xTOGVpK5zL
— MOVIE_FLICKS123 (@movieflicks123) January 3, 2023