దేశవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. కరోనా తర్వాత ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇండియాలో ఉన్న ఓటీటీల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు చాలా మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు వారికి ఆ సంస్థ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది.
ఓటీటీ ప్లాట్ ఫామ్ అంటే తెలియని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. కరోనా తర్వాత భారత్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఆదరణ బాగా పెరిగింది. అందరూ థియేటర్లలో సినిమాలు చూసే కంటే కూడా.. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఓటీటీల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు మంచి ఆదరణ ఉంది. ఎందుకంటే డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ అటు సినిమాలు మాత్రమే కాకుండా షోస్, ఒరిజినల్ సిరీస్ లు, హాలీవుడ్ కంటెంట్ బాగా స్ట్రీమ్ చేస్తుంటుంది. డిస్నీ ప్లస్ పేరుతో యాక్షన్ సినిమాల కోసం కేటగిరీనే ఉంటుంది. దానిలో అన్ని ప్రముఖ స్టూడియోస్ కి సంబంధించిన యాక్షన్ సిరీస్ లు ఉంటాయి.
హాట్ స్టార్ కు క్రమంగా ఆదరణ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే హాట్ స్టార్ ని ఎక్కువగా ఆదరించడానికి రెండు ముక్యమైన కారణాలు ఉండేవి. వాటిలో ప్రధానమైనది ఐపీఎల్ అని అందరికీ తెలిసిందే. అయితే ఐపీఎల్ హక్కులను వాయికామ్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత హాట్ స్టార్ కి సబ్ స్క్రైబర్లు బాగా తగ్గిపోయారు. ఆ తర్వాత రెండో ప్రధాన కారణం యాక్షన్ సినిమాలు, హాలీవుడ్ కంటెంట్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హాలీవుడ్ కంటెంట్ విరివిగా దొరుకుతుంది. ఎన్నో మంచి ఒరిజినల్ సిరీస్లు, బిగ్ స్టూడియోస్ కంటెంట్ ని స్ట్రీమ్ చేస్తుంటారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా హాట్ స్టార్ సబ్ స్క్రైబర్లను తగ్గించే అవకాశం ఉంది.
అదేంటంటే మార్చి 31 తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ HBO కంటెంట్ ప్రసారం చేయడం లేదు. ఈ విషయాన్ని అధికారికంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థే వెల్లడించింది. ఇప్పటికే యాప్ లో అందుబాటులో ఉన్న 10 లాంగ్వేజెస్ లోని లక్ష గంటలకుపైగా ఉన్న సినిమాలు, సిరీస్లు, టీవీ షోస్, ఒరిజినల్ సిరీస్ లను చూడచ్చని స్పష్టం చేసింది. కొత్తగా మాత్రం మార్చి 31 తర్వాత హెచ్ బీవో కంటెంట్ హాట్ స్టార్ లో ఉండబోదని తెలిపారు. 2016 నుంచి డిస్నీ స్టార్.. హెచ్ బీవో ఒరిజినల్ షోస్ ప్రసారం చేసింది.
2020లో హాట్ స్టార్ తో జత కట్టిన తర్వాత కూడా హెచ్ బీవో కంటెంట్ ని ఆపలేదు. ఇటీవలే ఖర్చలను తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సంస్థలో 5.5 బిలియన్ డాలర్ల వ్యయ నియంత్రణ చేపట్టాలని ఆ సంస్థ సీఈవో ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొద్దిరోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. ఇటీవలే ఆ సంస్థ దాదాపు 7 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన విషయం తెలిసిందే. హెచ్ బీవో కంటెంట్ ని వదులుకోవడం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థపై ప్రభావం చూపనుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.