ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీతో పాటు సినిమాలు చూసే ప్రేక్షకులలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు సినిమాలన్నీ థియేటర్స్ లో చూసేవారు. కానీ.. ఈ మధ్య థియేటర్స్ కి వెళ్లడం తగ్గించేసి ఓటిటి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతోందంటే.. ఏ థియేటర్ లోకి వస్తుంది అని అడిగేవారు.. ఇప్పుడు ఏ సినిమా విడుదలైనా ఓటిటిలోకి ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. లాక్ డౌన్ కి ముందు థియేట్రికల్ రిలీజ్ అయ్యే సినిమాలు.. నేరుగా టీవీలో ప్రీమియర్ అవుతుండేవి. ఎప్పుడైతే ఓటిటిలకు ఆదరణ పెరిగిందో.. అప్పటినుండి సినిమాలన్నీ అందులో చూసేందుకు అలవాటు పడిపోయారు.
ఇక థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ నెలా రెండు నెలల వ్యవధిలోనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న హీరోల వరకు ఎవరి సినిమా అయినా యాభై రోజుల్లో ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో సినిమా ఓటిటి రిలీజ్ కి సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడిగా మారి తెరకెక్కించిన మూడో సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. సొంత ప్రొడక్షన్ లో ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఓటిటి ఆహాలో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.
సుమంత్ అశ్విన్ తో పాటు మెహర్ చాహల్, కృతిక శెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా.. డిజిటల్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఇక సెప్టెంబర్ 9 నుండి ఈ 7 డేస్ 6 నైట్స్ మూవీ స్ట్రీమింగ్ మొదలు కానుందని ఆహా బృందం అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. నిర్మాతగా కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఎంఎస్ రాజు.. దర్శకుడిగా మంచి సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు. అలాగే ఎంఎస్ రాజు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుమంత్ అశ్విన్.. కేరింత సినిమా తర్వాత వరుస ప్లాప్ లను మూటగట్టుకున్నాడు. తూనీగ తూనీగ సినిమాతో డెబ్యూ చేసిన సుమంత్ కూడా మంచి కంబ్యాక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మరి రీసెంట్ గా చేసిన ‘7 డేస్ 6 నైట్స్’ మూవీ ఓటిటి రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Goa bachelor’s trip gone wrong?🤔
7Days6Nights asalu em jarigi untadi?#7Days6NightsOnAHA Premieres September 9th.@ChahalMeher @sumanthashwin #RishikaBali pic.twitter.com/MU6shbCPYr— ahavideoin (@ahavideoIN) September 5, 2022