విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ ఏబీవీపీ బంద్ కు పిలుపు నిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని నిలిపి వేయాలని, జీవో నెం.117 ఉత్తర్వు లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రేపు(మంగళవారం) పాఠశాలల బంద్ నిర్వహిస్తోంది. ఆదివారం ఏలూరులో సమావేశమైన సంఘ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ తో పాటు తెలుగు మాద్యమాన్ని కూడా కొనసాగించాలని, నాడు–నేడు పేరుతో పాఠశాలల్లో జరుగుతున్న పనుల్లో అవినీతి పతాకస్థాయికి చేరుకుందని, వీటిపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా వున్న 24 వేలకుపైగా టీచరు పోస్టులను భర్తీ చేయాలన్నారు.
ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలి. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ నిర్వహించాలని తెలిపారు. డీఎస్సీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1:30 నిష్పత్తిలో ఖాళీగా ఉన్న 24వేలకు పైగా టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి డిమాండ్ చేశారు. పాఠశాలల బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏబీవీపీ సంఘ నాయకులు పాల్గొన్నారు. మరి.. ఏబీవీపీ తీసుకున్న ఈ పాఠశాల బంద్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Godavari Floods: వరద సాయంపై అధికారులకు సీఎం జగన్ కీలక ప్రకటన!
ఇదీ చదవండి: నిర్మాత బన్నీ వాసుకి తప్పిన ప్రమాదం!