తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 150మంది అస్వస్థతకు గురైన ఆస్పత్రులకు పరుగులు తీశారు. సికింద్రాబాద్ పరిధిలోని చింత బావి బస్తీలో 150 మందికి తీవ్ర అస్వస్థత పాలయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు స్పందించారు.
కలుషితమైన ఆహారం, నీరు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో అందరికి తెలిసిందే. పలు సందర్భాల్లో కలుషిత నీరు, ఆహారం తిని ఎంతోమందే ప్రాణాలు కోల్పోయారు. అలానే మరెందరో అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలా కలుషిత ఆహారం, నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు అనే వార్తలు తరచూ మనం వింటుంటాము. తాజాగా హైదరాబాద్ లో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి దాదాపు 150 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని సికింద్రబాద్ ప్రాంతంలో కలుషిత నీరు తాగి 150 మంది అస్వస్థకు గురయ్యారు. సికింద్రాబాద్ లోని చింత బావి బస్తీలో ప్రాంతం వందల మంది తీవ్ర అస్వస్థత పాలయ్యారు. ఈ ప్రాంతంలో గత మూడు రోజులుగా కలిసిత నీరు సరఫరా అవుతోందని స్థానికులు అంటున్నారు. వేరే గత్యంతరం లేక ఈ నీరే తాగాల్సి రావడంతో బస్తివాసులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. మూడులు రోజుల వ్యవధిలో 150 నుంచి 200 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వారందరూ ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు, వృద్ధులు ఉన్నారు.
వీరికి వాంతులు విరోచనాలు కావడంతో ఆస్పత్రులకు తరలించారు. చాలా మంది వాంతులు, విరోచనాలతో నరకయాతన అనుభవించారు. ఈ ఘటనపై ఫిర్యాదులో అందడంతో అప్రమత్తమైన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ పొల్యూషన్ ఎక్కడ జరిగిందని అధికారులు తనిఖీ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కలుషిత నీటి సరఫరా కావడంతో వాటిని తాగిన వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఇలా కలుషితమైన నీరు, ఆహార పదార్ధాలతో ప్రజలు అనారోగ్యానికి గురి కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.