ఎస్సై 16 మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరో అయ్యారు. 16 మందిని అరెస్ట్ చేసి డీసీఎం వ్యాన్ లో తరలిస్తుండగా డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. దీంతో డీసీఎం వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. అది గమనించిన ఎస్సై కరుణాకర్ రెడ్డి వెంటనే డీసీఎం లోంచి దూకి వారిని రక్షించారు.
ప్రగతి భవన్ ను ముట్టడించిన 16 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యకర్తలను డీసీఎంలో ఎక్కించి స్టేషన్ కు తరలిస్తుండగా డీసీఎం నడిపే హోంగార్డు రమేష్ కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దీంతో డీసీఎం వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. అది గమనించిన బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి డీసీఎం లోంచి కిందకు దూకి వాహనాన్ని అదుపు చేశారు. ఈ ఘటన ఖైరతాబాద్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఏబీవీపీ కార్యకర్తలు ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఆందోళన చేపట్టే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని డీసీఎం వాహనంలో ఎక్కించారు. ఖైరతాబాద్ మీదుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా.. డీసీఎం వాహనాన్ని నడుపుతున్న హోం గార్డు రమేష్ కు ఫిట్స్ వచ్చాయి. అయితే డీసీఎంలో ఉన్న బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి చాకచక్యంగా కిందకు దూకి వాహనాన్ని అదుపు చేసి 16 మంది ప్రాణాలను కాపాడారు. అయితే ఈ ఘటనలో ఎస్సై కరుణాకర్ రెడ్డి, కానిస్టేబుల్ సాయికుమార్ లకు గాయాలయ్యాయి. మిగతా పోలీసులు అప్రత్తమై హోంగార్డు రమేష్ తో పాటు గాయాలపాలైన ఎస్సై, కానిస్టేబుల్ లను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరి 16 మంది ప్రాణాలను కాపాడిన ఎస్సైకి ఓ సెల్యూట్ చేయండి.