ఎస్సై 16 మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరో అయ్యారు. 16 మందిని అరెస్ట్ చేసి డీసీఎం వ్యాన్ లో తరలిస్తుండగా డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. దీంతో డీసీఎం వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. అది గమనించిన ఎస్సై కరుణాకర్ రెడ్డి వెంటనే డీసీఎం లోంచి దూకి వారిని రక్షించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (హెచ్‌సీయూ) ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్ధి సంఘాల మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు యూనివర్సిటీ క్యాంపస్ లో బీబీసీ ప్రసారం చేసిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. వందమంది పోలీసుల మధ్య డాక్యుమెంటరీని ప్రదర్శించారు. యూనివర్సిటీ యాజమాన్యం స్క్రీనింగ్ నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐకి మెయిల్ చేసింది. అయినా గానీ ఎస్ఎఫ్ఐ పట్టుబట్టి మరీ ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించింది. […]
Rajampet: ఓ ఏబీవీపీ నాయకుడి చెంపను చెళ్లుమనిపించారు ఓ మహిళా హెచ్‌ఎమ్. పరుష పదజాలంతో మాట్లాడినందుకు ఆ విధంగా సమాధానం ఇచ్చారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో నెంబర్ 117 రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఏబీవీపీ నాయకులు మంగళవారం విద్యాసంస్థల బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజంపేటలో బంద్ ఎలా జరుగుతోందో చూడ్డానికి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి అశోక్ ఒక్కో […]
విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ ఏబీవీపీ బంద్ కు పిలుపు నిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని నిలిపి వేయాలని, జీవో నెం.117 ఉత్తర్వు లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రేపు(మంగళవారం) పాఠశాలల బంద్ నిర్వహిస్తోంది. ఆదివారం ఏలూరులో సమావేశమైన సంఘ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ తో పాటు తెలుగు మాద్యమాన్ని కూడా కొనసాగించాలని, నాడు–నేడు పేరుతో […]