నేటికాలంలో ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థితిలో ఉంటున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం ఆడపిల్లను చదవించడం అంటే తల్లిదండ్రులు భారంగా భావించేవారు. అయినా కొందరు మహిళలు వయస్సుతో సంబంధం లేకుండా యాభై పదుల వయస్సు దాటిన కూడా చదువుతుంటారు.
నేటికాలంలో ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థితిలో ఉంటున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం ఆడపిల్లను చదవించడం అంటే తల్లిదండ్రులు భారంగా భావించేవారు. అందుకే చాలా మంది చదువుపై ఇష్టం ఉన్నా కూడా కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుకోలేరు. అయితే కొందరు మహిళలు మాత్రం చదువుకు వయస్సు అడ్డం కాదని యాభై పదుల వయస్సు దాటిన తరువాత కూడా చదువుతుంటారు. ఆకోవాకు చెందిన మహిళానే ఆదిలాబాద్ కు చెందిన చిలక పద్మ. మరి.. ఆమె స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఆదిలాబాద్ జిల్లాలో జైనథ్ కు చెందిన గ్రామంలో చిలక పద్మ అనే 55 ఏళ్ల మహిళ నివాసం ఉంటుంది. ఆమె గతంలో ఏడవ తరగతి వరకు చదివి ఆపేసింది. చదువు ఆపాలని ఆలోచన లేకున్న పరిస్థితులు అనుకూలించగా చదువును మధ్యలోనే ఆపేసింది. ప్రస్తుతం చిలక పద్మ జైనథ్ గ్రామంలో ఓ వార్డు సభ్యురాలుగా పనిచేస్తుంది. అక్కడ ఉన్న ప్రజల బాగోగుల గురించి తెలుసుకొని, సమస్యలను పరిష్కరిస్తూ తన విధులను నిర్వహిస్తోంది.
ఇలా ప్రజాసేవలో ఉన్నా కూడా ఆమెకు చదువుపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. అందుకే మధ్యలో ఆపేసిన తన చదువును పూర్తి చేయాలని అనుకుంది. అలానే పదో తరగతి ఉత్తీర్ణత కావాలని కోరిక బలంగా ఉండిపోయింది. ఈ క్రమంలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి చదువుతుంది. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల-1 ఓపెన్ స్కూల్ పదోవ పరీక్షకు ఆమె హాజరు అయ్యారు. ఆమె సాధారణ విద్యార్థి లాగా వచ్చి పరీక్షలు రాసింది. ఈ సందర్భంగా ఆమె భర్త చిన్నన్నతో పాటు మనవడుతో ఆమె పరీక్ష కేంద్రానికి వచ్చారు.
అలా భర్త , మనవడితో వచ్చి… పరీక్ష రాయడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ప్రజాప్రతినిధులు ఉన్నత చదువులు చదువుకుంటే ప్రజలకు గొప్ప సేవలు చేయవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా 55 ఏళ్ల వయస్సులో ఆమె పరీక్షకు హాజరు కావడం స్థానికంగా ఆసక్తకి రేత్తించింది. చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తిని చూసిన స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆమెను అందరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మరి.. ఇలా 55 ఏళ్ల మహిళ పరీక్షలు రాయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.