సమాజంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు, దారుణాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇంటి నుంచి కాలు బయటపెట్టిన ఆడబిడ్డకు రక్షణ అనేది లేకుండా పోతుంది. లైంగిక వేధింపుల వంటి ఘటనలతో మహిళలు తీవ్ర వేదన చెందుతున్నారు. కొందరు కామాంధులు దారుణంగా చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టడటం లేదు. తమను ప్రేమించాలంటూ, కోరిక తీర్చాలంటూ అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఒక వ్యక్తి మనవరాలి వయస్సు ఉండే యువతిని లైంగికంగా వేధించాడు. […]
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఎంత సంబరంగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లిన వారు సంక్రాంతి పండుగకు తమ సొంత ఊళ్లకు చేరుకుంటారు. ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకునేందుకు పిల్లలు, పెద్దలు, యువకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరికొద్ది రోజుల్లోనే సంక్రాంతి పండగ రానుంది. అయితే ఊరిని వదలి ఎక్కడ పట్టణాల్లో నివాసం ఉంటున్న వాళ్లు సంక్రాంతి కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తమ సొంత […]
ఇటీవల కాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ఘటనల్లో ఎందరో అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయి. గతంలో సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ లాడ్జీలో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది మరణించారు. అలానే బోయిన్ పల్లి ప్రాతంలో ఓ అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఆరుమంది మరణించగా పలువురికి గాయాలయ్యాయి. తాజాగా విశాఖపట్నంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. వైజాగ్ లోని విశాఖ […]
తెలుగు సినీ ప్రపంచంలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి..రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ స్థాయిలోనూ అనేక సంచలనాలు సృష్టించారు. సినిమాలోను ఆయనది ఓ ఘనమైన చరిత్ర. ఆయన అనంతరం సినీ రంగలో హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు.. స్టార్ హీరోలుగా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో తారక్ ఒకరు. తనదైన నటనతో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు పొందాడు. అయితే […]
నేటికాలంలో దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. దీని ద్వారా సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం చాలా మందికి తెలుసు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ లను దాదాపు అందరూ ఉపయోగిస్తున్నారు. ఫేస్ బుక్ అయితే గ్రామాల్లో పనులు చేసుకునే వారు సైతం ఉపయోగిస్తున్నారు. దీనిని సరైన విధంగా ఉపయోగిస్తే మంచిగా ఉంటుంది. అదే దారితప్పితే మాత్రం నష్టం జరుగుతుంది. అలా ఫేస్ బుక్ పరిచయం ఓ మహిళలను […]
మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఎం.వి. శేషగిరిబాబు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 70.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర జనరల్ లో 35 శాతం, ఒకేషనల్ లో 42 శాతం మంది పాస్ అయ్యారు. అదే విధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ 33 శాతం, […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథ రెడ్డి(34) శుక్రవారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఓ అపార్ట్ మెంట్ లోని రూ.101వ నెంబరు ఫ్లాటులో ఈ ఘటన చోటుచేసుకుంది. మంజునాథ రెడ్డి అప్పుడప్పుడూ ఈ ఫాటుకు వచ్చి రెండు,మూడు రోజులు ఉండి వెళ్తుంటారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట ఇక్కడి వచ్చిన ఆయన శుక్రవారం నిర్జీవ […]
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. బుచ్చిరెడ్డిపాలెం మినగల్లులో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు పంట పొల్లాలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్దులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ ఏబీవీపీ బంద్ కు పిలుపు నిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని నిలిపి వేయాలని, జీవో నెం.117 ఉత్తర్వు లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రేపు(మంగళవారం) పాఠశాలల బంద్ నిర్వహిస్తోంది. ఆదివారం ఏలూరులో సమావేశమైన సంఘ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ తో పాటు తెలుగు మాద్యమాన్ని కూడా కొనసాగించాలని, నాడు–నేడు పేరుతో […]
మన దేశం ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయం అని చెప్పవచ్చు. చాలా ఆలయాల్లో ఏడాది పొడవున భక్తులు దర్శనం ఉంటుంది. కానీ కొన్నిఆలయాల్లో మాత్రం సంవత్సరంలో కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. అలాంటి ఎన్నో ఆలయాల్లో సంగమేశ్వర ఆలయం ఒకటి. నంద్యాల జిల్లాలోని శ్రీ సంగమేశ్వర ఆలయం ఏడాది కాలంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. అయితే ఈ ఆలయం నాలుగు నెలలు మాత్రమే దర్శనం ఇవ్వడానికి […]