ఈ రోజు బంగారం ధరలో మార్పు లేదు
పెరిగిన వెండి ధర
మార్కెట్ లో బంగారం ధరల
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,450.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,590.
1కిలో వెండి 77, 500
బిజినెస్ డెస్క్- ఈ రోరోజు బుధవారం బంగారం ధరల్లో మార్పు లేదు. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ తో పాటు, 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా స్ధిరంగా ఉంది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 45 వేల 450 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 49 వేల 590 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి వెయ్యి రూపాయల మేర తగ్గింది. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 77 వేల 500 పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 840 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 920 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో కరోనా వైరస్ ప్రభావం బంగారం ట్రేడింగ్ పై పడుతోంది. ఈ నేపధ్యంలోనే గోల్డ్ ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రూపాయితో డాలర్ మారకం విలువ కూడా గోల్ట్ మార్కెట్ పై ప్రభావం చూపుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.