22 క్యారెట్ 10గ్రా బంగారం 45,730.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,890.
1కిలో వెండి 70,400బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధర 10గ్రాములకు కేవలం 10 రూపాయల చొప్పున తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 45 వేల 730 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 49 వేల 890 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధరలో మార్పు లేదు. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 70 వేల 400 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 370 రూపాయలు తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 290 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 46 వేల 050 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 50,240 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,290 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 49,290 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,880 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 52,230 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.