దేశ ప్రజలందరికీ కోవిషీల్డ్ కోవాగ్జిన్, స్పుత్‌నిక్ టీకాలను వేస్తున్నారు. కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో చాలా మందికి వ్యాక్సిన్ వేశారు. చాలా మంది ప్రజలు కోవిషీల్డ్ టీకాను తీసుకుంటున్నారు. కోవాగ్జిన్ తో పోలిస్తే సెరోపోసిటివిటీ, మీడియన్ యాంటీ-స్పైక్ యాంటీబాడీ రేటు కోవిషీల్డ్‌లో గణనీయంగా నమోదైందని డాక్టర్ ఎకె సింగ్, అతని సహచర బృందం అధ్యయనంలో తేలింది.మూడో వేవ్ వస్తుందని చెబుతున్న నేపథ్యంలో మరోమారు కోవిషీల్డ్ టీకాలపై ఓ వార్త చర్చకు వచ్చింది. అదేమిటంటే చాలా మంది కోవిషీల్డ్ తీసుకున్నప్పటికీ కోవిడ్ బారిన పడుతున్నారు. కోవిషీల్డ్ తీసుకున్నవారికి మూడో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ అభిప్రాయ పడింది.
రెండో డోసు తీసుకున్న తరువాత ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలను ఆ వేరియెంట్ 3.2 రెట్లు ఎక్కువ వేగంగా తగ్గిస్తుంది. దీని వల్లే కోవిషీల్డ్ రెండు డోసులను తీసుకున్న వారికి మూడో డోసు వేయాల్సిన అవసరం ఏర్పడిందని ఐసీఎంఆర్ ఎపిడెమియాలజీ అండ్ ఇన్‌ఫెక్షన్ హెడ్ డాక్టర్ సమీరన్ పాండా అన్నారు. దీని వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఇతర వ్యాక్సిన్ల గురించి ఈ విధంగా ఐసీఎంఆర్ ఏమీ చెప్పలేదు.