కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడ చూసినా చావు కేకలు వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లపాటు లాక్‌డౌన్‌లు, కోవిడ్ ఆంక్షలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కరోనా వల్ల ప్రాణాలు పోవడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమయ్యింది.
ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి ఎంతటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక, ప్రాణ నష్టాన్ని కలిగించింది. దీనిక ప్రభావం వల్ల ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం ఉద్యోగస్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగస్తులను తొలగించేస్తున్నాయి.
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న దేశంలో 67,597 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న కోలుకున్న వారి సంఖ్య 1,80,456గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 170,21,72,615 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా విజృంభన కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ పూర్తిగా ముగిసిందని చెప్పుకోవచ్చని తెలంగాణ […]
గత రెండు నెలలు గా దేశంలో కరోనా విజృంభణ కొనసాగింది. పది వేల నుంచి ఏకంగా మూడు లక్షల వరకు కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకు వచ్చింది. అయితే దేశ వ్యాప్తంగా యుద్ద ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. వ్యాక్సినేషన్ తీసుకోవడం కరోనా భారిన పడ్డా త్వరగా కోలుకుంటున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 83,876 కేసులు […]
ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌తో పోరాడుతున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట్లో మరొకరు కరోనా బారిన పడ్డారు. దాదా ముద్దుల కూతురు సనాకు కూడా కరోనా సోకింది. ఆమెకు ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ప్రస్తుతం సనా ఐసోలేషన్‌లో చికిత్స పొందతుంది. అయితే గంగూలీ భార్య డోనాకు మాత్రం వైరస్ సోకలేదు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా తేలింది. గతంలో గంగూలీ సోదరుడు కూడా కరోనా బారిన పడ్డాడు. డిసెంబర్‌లో […]
దేశంలో కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 213కు చేరిందని కేంద్ర వైద్య శాఖ వివరించింది. వాటిల్లో ఢిల్లీ, మహారాష్ట్రల్లో 57, 54 కేసులు ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 90 ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు కోలుకున్నారని వివరించింది. కాగా, తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ మద్యనే ఆంధ్రప్రదేశ్‌లో ఒకరికి ఒమిక్రాన్ సోకగా, చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా ఏపిలో మరో ఒమిక్రాన్ కేసు […]
టెన్నిస్ స్టార్ ఆటగాడు రాఫెల్ నాదల్ కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో టెన్నిస్ ప్రపంచం ఉలికి పడింది. ఇటివల నాదల్ దుబాయ్‌లో ఒక ఈవెంట్‌లో పాల్గొన్నాడు. దీంతో అక్కడే తనకు కరోనా సోకినట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో తనతో కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నాదల్ కోరారు. #RafaelNadal Says He has Tested Positive For #Covid NDTV’s Osama Shaab reports Read more: https://t.co/40uSa5zo2X […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దుకాణాదారులకు కరోనా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అనుసరించాల్సిన నియంత్రణ చర్యలు దుకాణాదారులకు సూచించింది. దుకాణానికి ఎవరైన మాస్క్ లేకుండా వస్తే దుకాణాదారుడికి రూ.10 నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించి, రెండు రోజుల పాటు దుకాణం మూసివేయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్గదర్శకాలతో ఏపీలోని దుకాణాదారులు ఖంగుతిన్నారు. మాస్క్ లేకుండా తిరిగే వ్యక్తులకు ఫైన్ వేయకుండా.. తమపై జరిమానా విధిస్తే ఎలాగంటూ దుకాణాదారులు […]
కరోనా వైరస్ వెలుగు చూసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. ప్రతి ఒక్కరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రోజులు గడిపేస్తూ బ్రతికారు.. బ్రతుకుతున్నారు. కరోనా ఎంతోమంది కుటుంబాల్లో విషాదం నింపింది . తమ కళ్ల ముందే రక్త సంబంధికులు చనిపోతే చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.ఇలాంటి బాధకరమైన సంఘటనలు మరువక ముందే… ఈ మధ్యలో పలు దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో డెల్టా వేరియంట్ […]
మానవ జాతిని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు మూగ జీవాల పాలిట మృత్యువై వెంటాడుతుంది. అమెరికాలోని సెయింట్ లూయిస్ జూలో ఎనిమిది జంతువులు కరోనా బారిన పడ్డాయి. విటిలో రెండు సింహాలు, రెండు చిరుత పులులు, ఒక అమూర్ టైగర్, ఒక ప్యూమా, రెండు జాగ్వార్‌లు ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. వీటిలో నాలుగింటిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించినట్లు.. మరికొన్ని జలుబు, దగ్గుతో బాధపడుతున్నాయని యూఎస్ సెయింట్ లూయిస్ జూ అధికారులు తెలిపారు. ఈ […]