వైరస్ ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి పంజా విసురుతోంది. అనేకమంది ప్రాణాలు తీస్తోంది. ఒకవైపు కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు టీకాకు లొంగని పరిస్ధితి నెలకొంది. వ్యాక్సిన్ వేయించుకున్న వారు సైతం తిరిగి వ్యాధి బారిన పడుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. సింగిల్ డోస్ టీకా లేదా రెండు డోసుల టీకా తీసుకున్నాక 6 నెలల సమయం దాటి ఉన్నవారు బూస్టర్ షాట్ తీసుకోవాల్సి […]
దేశ ప్రజలందరికీ కోవిషీల్డ్ కోవాగ్జిన్, స్పుత్‌నిక్ టీకాలను వేస్తున్నారు. కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో చాలా మందికి వ్యాక్సిన్ వేశారు. చాలా మంది ప్రజలు కోవిషీల్డ్ టీకాను తీసుకుంటున్నారు. కోవాగ్జిన్ తో పోలిస్తే సెరోపోసిటివిటీ, మీడియన్ యాంటీ-స్పైక్ యాంటీబాడీ రేటు కోవిషీల్డ్‌లో గణనీయంగా నమోదైందని డాక్టర్ ఎకె సింగ్, అతని సహచర బృందం అధ్యయనంలో తేలింది.మూడో వేవ్ వస్తుందని చెబుతున్న నేపథ్యంలో మరోమారు కోవిషీల్డ్ టీకాలపై ఓ వార్త చర్చకు […]
కరోనాలో రకరకాల కధనాలు వింటూ ఉన్నాం. ఒక్కోక్కటీ ఒక్కోతరహా… ఇందులో విషాదాలే ఎక్కువ. వాక్సిన్ విషయంలోనూ ఎన్నో వార్తలు వింటున్నాం. ఇప్పుడు మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతికి వైద్య సిబ్బంది ఒకే సారి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా యువతిని ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. వ్యాక్సిన్ కోసం అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్‌కు 21 ఏళ్ళ లక్ష్మీ ప్రసన్న వెళ్లారు. ఫోన్ మాట్లాడుతూ ఆమెకు నర్సు పద్మ వెంట వెంటనే రెండు డోసుల […]
కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు నుంచీ ఆందోళన చెందుతున్నట్లుగానే అగ్రరాజ్యాలుగా వెలుగొందుతోన్న ధనిక దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో దూసుకుపోతున్నాయి. అమెరికా జనాభా 33 కోట్లు కోగా, అందులో 28కోట్ల మంది ఇప్పటికే వ్యాక్సిన్లు పొందారు. ఇక బ్రిటన్ తాజాగా నాలుగో టీకాకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లన్నీ రెండు డోసులవి కాగా, జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన సింగిల్ డోస్ టీకాకు యూకే ఆమోదం తెలిపింది. యూకేలో ఆమోదం […]
ఇప్పుడు ఏ సినిమాలు రిలీజులు లేవు. ఫ్యాన్స్ హడావుడి అంతకన్నా లేదు.. ఎవరూ గడపదాటి బయటకు రావడంలేదు. అలాంటప్పుడు మహేష్‌బాబు ఇంటి ముందు భారీ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు? మరి ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ఇంటి ముందు భారీగా సెక్యూరిటీ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఎంతటివాళ్లనైనా బలి తీసుకొంటోంది. దానికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. గొప్ప, పేద, […]
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత రిలీఫ్ ఇస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) కరోనా టీకాను సింగిల్ డోస్ వేసుకున్నా, వైరస్ తో చనిపోయే ప్రమాదం 80 శాతం వరకూ తగ్గుతుందని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ)’ సంస్థ వెల్లడించింది. అలాగే ఫైజర్ బయో ఎన్ […]
కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ తాకుతోంది. ఇలాంటి సమయంలో వ్యాక్సినే రక్ష. 60 ఏళ్లు పైబడినవారికీ, 45 ఏళ్లు దాటినవారికీ కేంద్రం ఇప్పటికే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది.వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా, ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సిన్ సెంటర్లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, వ్యాక్సిన్లు అందించడానికి కంపెనీలు సిద్ధమైనా, వాటిని కొనుగోలు చేసి ఉచితంగా ఇవ్వడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావడం లేదు. ప్రతి డోస్‌కు […]