ఇంతకాలం హీరోయిన్‌గా నటించిన యంగ్ బ్యూటీ తాప్సీ పన్ను ఇప్పుడు నిర్మాతగానూ మారారు. తాప్సీ ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. దాంతో హిందీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న తాప్సీ చాలా కాలం తర్వాత ఓ తెలుగు సినిమాలో కూడా నటించబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ మధ్యే హసీన్ దిల్రూబ అనే చిత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. రీసెంట్ గా ఆమె నిర్మాణంలో ఓ సినిమాను నిర్మించనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
తన కొత్త ప్రొడక్షన్ కంపెనీ గురించిచెప్పుకొచ్చింది. ‘అవుట్ సైడర్స్’ బ్యానర్‌తో తాప్సీ కొత్త చిత్రాన్ని నిర్మించబోతోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి. ‘గొప్ప బాధ్యతలను భుజాన వేసుకున్నప్పుడే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. ఆశీర్వదించండనీ, ‘అవుట్ సైడ్’ నుంచి వచ్చే ఆలోచనలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. తాను నిర్మాతగా కొత్త దశలోకి అడుగుపెడుతున్నాననీ, అవుట్ సైడర్స్ ఫిల్మ్స్ అనే బ్యానర్ మీద ఇకపై చిత్రాలను నిర్మించబోతోన్నాననీ తాప్సీ ప్రకటించింది.
#PranjalKhandhdiya and yours Truly for #OutsidersFilms pic.twitter.com/6uW1RiaROB
— taapsee pannu (@taapsee) July 15, 2021