భారీగా తగ్గిన వెండి ధర
స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 100 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 120 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,800.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,880.
1కిలో వెండి 61,000బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 10 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 12 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు పెరిగి 44 వేల 800 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 120 రూపాయలు పెరిగి 48 వేల 880 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 3600 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 61 వేల రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 450 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 480 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,010 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46 వేల 580 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48 వేల 580 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,850 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,100 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.