బిజినెస్ డెస్క్- భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగానికి సంబందించి ఆర్బీఐ నియంత్రణను విధించింది. ఐతే అన్ని కార్డులపై మాత్రం కాదు.. కేవలం మాస్టర్ కార్టులపై మాత్రం ఆంక్షలను విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మాస్టర్ కార్డ్‌పై ఆంక్షల్లో భాగంగా కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
మాస్టర్ కార్డు నెట్ వర్క్‌లో కొత్త వినియోగదారులను పొందకుండా నియంత్రణను అమల్లోకి తెచ్చింది. ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు జూలై 22 నుంచి అమలులోకి వస్తాయి. జూలై 22 నుంచి మాస్టర్ కార్డు కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. పేమెంట్ సిస్టమ్స్ డేటా స్టోరేజ్‌కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నియమ, నిబంధనలను మాస్టర్ కార్డు అతిక్రమించిన నేపధ్యంలో ఈ ఆంక్షలను విధించారు.
పేమెంట్ సిస్టమ్స్ డేటా స్టోరేజ్‌కి సంబంధించి మాస్టర్ కార్డ్ కంపెనీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగినంత సమయం ఇచ్చింది, అయినప్పటికీ ఆ సంస్థ పేమెంట్ సిస్టమ్ డేటా స్టోరేజ్ ఆదేశాలకు అనుసరించకపోవడంతో ఆర్బీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఐతే ఆర్బీఐ నిర్ణయం వల్ల ప్రస్తుతం మాస్టర్ కార్డుకు సంబందించిన డెబిట్, క్రెడిట్ కార్టులు వాడుతున్న వినియోగదారులపై ఎటువంటి ప్రభావం ఉంండదని అధికారులు తెలిపారు.