దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ పెద్దన్న లాంటిది. ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులకు ఆర్ బీఐ అత్యున్నత బ్యాంక్. ఇతర బ్యాంకులకు లైసెన్సులు ఇవ్వాలన్నా, రద్దు చేయాలన్నా ఆర్ బీఐ కీలక నిర్ణయాలు జారీ చేస్తుంది.
దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ పెద్దన్న లాంటిది. ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులకు ఆర్ బీఐ అత్యున్నత బ్యాంక్. ఇతర బ్యాంకులకు లైసెన్సులు ఇవ్వాలన్నా, రద్దు చేయాలన్నా ఆర్ బీఐ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ అధిపతిని గవర్నర్ అంటారు. ప్రస్తుతం మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తి కాంత దాస్. RBI మానిటరీ పాలసీకి శక్తికాంత దాస్ బాధ్యత వహిస్తారు. మరో ఐదుగురు సభ్యులు ఇందులో భాగమయ్యారు. రెపో రేటు, రివర్స్ రెపో రేటును రెండు నెలల సమావేశంలో ద్రవ్య విధాన కమిటీ నిర్ణయిస్తుంది. రెపో రేటుపై రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం సామన్యులకు ఉపశమనం కలిగించింది. రెపో రేటు పెంచకుంటే గృహ రుణాల రేట్లు కూడా స్థిరంగా ఉంటాయి. కాబట్టి ఇది సామాన్యులకు ఊరట కలిగించినట్లే.
ఆర్ బీఐ గవర్నర్ నాయకత్వంలో ఆరుగురు సభ్యుల అత్యున్నత స్థాయి ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. గురువారం ఆగస్టు 10వ తేదీన నిర్ణయాలు వెలవడనున్నాయి. ద్రవ్యోల్బణంపై నిశ్చిత పరిస్థితి లేనందున యథాతథ రెపోరేటు అంటే ప్రస్తుతం ఉన్న 6.5 శాతానికే నిర్ణయించుటకు అవకాశమున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇదే జరిగితే రెపో రేటు యథాతథ స్థితి కొనసాగుతుంది. ఇది వరుసగా మూడోసారి అవుతుంది. తీవ్ర ద్రవ్యోల్బణం నేపథ్యంలో గత సంవత్సరం మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగింది. ఈ సంగతి అందరికి తెలిసిందే. దీంతో ఈ రేటు 6.5 శాతం ఫిబ్రవరికి చేరింది. ఆ తర్వాత రేటు మార్పు నిర్ణయాలు తీసుకోలేదు.