దేశంలో ఇటీవల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మద్య మాటల యుద్దం నడుస్తుంది. దేశాభివృద్ది కోసం ఎంతో పాటు పడుతున్నామని.. దేశాన్ని ప్రగతిపధంలో ముందుకు నడిపిస్తున్నామని బీజేపీ అంటుంటే.. బీజేపీ పాలనలో దేశం పూర్తిగా బ్రస్టుపట్టిపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తుంది.
దేశ వ్యాప్తంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధికారంలో ఉండి దేశాన్ని బ్రస్టు పట్టిస్తున్నారని.. కార్పోరేట్ దిగ్గజాలకు కొమ్ము కాస్తున్నారని బీజేపీపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో బీజేపీ నేతలు నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీ వేదిక వివాదాస్పదం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని రత్లాంలో ఈనెల 4, 5 తేదీల్లో భారతీయ జనతా పార్టీ 13 వ మహిళా బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీల్లో కండలు తిరిగిన మహిళలు తమ బాడీ సౌష్టవాన్ని ప్రదర్శించారు. మహిళా బాడీ బిల్డర్లు తమ ప్రదర్శన హనుమంతుడి కటౌట్ ముందు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. బికినీలు ధరించి హనుమంతుడి విగ్రహం ముందు ప్రదర్శనలు చేయడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు అపచారంగా పేర్కొంటూ సభా వేదికపైకి వెళ్లి హనుమంతుడి కటౌట్ కి గంగాజలంతో పరిశుభ్రం చేయడమే కాదు.. హనుమాన్ చాలిసా పఠించారు. ఇలాంటి దారుణమైన పనికి తెగబడిన వారికి హనుమంతుడి శాపం తగులుతుందని కాంగ్రెస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారు.
ఈ పోటీలకు ప్రత్యేక ఆహ్వానితులుగా నగర బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటెల్, ఎమ్మెల్యే చైతన్య కశ్యప్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ కాంగ్రెస్ నేతలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మహిళలు క్రీడా రంగంలో రాణించాలన్న ఉద్దేశం లేనట్టుందని.. కుస్తీ, జిమ్నాస్టిక్, ఈతలు ఇలా ఏ క్రీడల్లో అయినా ఇప్పుడు మహిళలు ఎంతో ప్రతిభ కనబరుస్తున్నారని.. మహిళా బాడీ బిల్డర్స్ ప్రదన్శనను విమర్శించడం సిగ్గు చేటు అని బీజేపీ అధికార ప్రతినిధి హితేజ్ బాజ్ పాయ్ అన్నారు. అంతేకాదు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం.. వివమర్శించడం లాంటివి చేసినందుకు కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మెమోరాండం సమర్పించారు బీజేపీ నేతలు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళలకు ఎంతో గౌరవం ఇస్తుందని.. మహిళలు క్రీడల్లా రాణించాలని ఎవరికైనా ఉంటుందని.. కానీ ఇలా హిందూ సంప్రదాయలు బ్రస్టు పట్టించే విధంగా బీజేపీ ప్రవర్తించిదని.. హిందువులు ఎంతో భక్తితో కొలిచే హనుమంతుడి కటౌట్ ముందు ఇలా మహిళల అర్థనగ్న ప్రదర్శ ఎవరూ హర్షించని.. విగ్రహం ముందు ఇవేం పనులు అంటూ జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మయాంక్ జట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ పియూష్ బాబెలే ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు.. ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమాన్ కటౌట్ ముందు ఇలాంటి అసభ్యకరమైన ప్రదర్శనలు నిర్వహించడం.. ఆయనను అవమానించినట్లే.. హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.
बीजेपी नेताओं ने किया हनुमान जी का अपमान :
रतलाम में भाजपा के बीजेपी विधायक चैतन्य कश्यप और महापौर प्रह्लाद पटेल ने हनुमान जी की मूर्ति स्टेज पर रखकर अश्लीश कार्यक्रम का आयोजन किया।
शिवराज जी,
भाजपा बार-बार हिन्दुओं का अपमान क्यों करती है❓ pic.twitter.com/C4FWb2i72N— MP Congress (@INCMP) March 6, 2023