దేశంలో ఇటీవల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మద్య మాటల యుద్దం నడుస్తుంది. దేశాభివృద్ది కోసం ఎంతో పాటు పడుతున్నామని.. దేశాన్ని ప్రగతిపధంలో ముందుకు నడిపిస్తున్నామని బీజేపీ అంటుంటే.. బీజేపీ పాలనలో దేశం పూర్తిగా బ్రస్టుపట్టిపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తుంది.
దేశ వ్యాప్తంగా హనుమాన్ జన్మదినోత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నా.. ఈ ఏడాది ఒక ప్రత్యేకత ఉంది. గుజరాత్ రాష్ట్రంలో మోర్బి జిల్లాలో 108అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం వీడియోకాన్ఫిరెన్స్ లో జరిగింది. ఈ పుణ్య కార్యంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. ‘ఈ రోజు […]