బాహుబలి సినిమా తో రెబల్ స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ చూసి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు నెగిటివ్ గా ప్రచారం మొదలెట్టారు. బాలీవుడ్ లో కొత్త హీరోలను ఆహ్వానించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. తెలుగు హీరోకు అక్కడ స్టార్ స్టేటస్ రావడం వ జీర్ణించుకోలేక ప్రభాస్ పై ట్రోలింగ్ చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశారు. నాగ్అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ అన్ని సినిమాల విషయం పక్కన పెడితే ఆదిపురుష్ టీమ్‌ను మాత్రం వరుసగా కష్టాలు వెంటాడుతూ వచ్చాయి.
ఆదిపురుష్ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ప్రభాస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అందులో ప్రభాస్ కాస్త బరువు పెరిగినట్టు గా కనిపిస్తు న్నాడు. అయితే డార్లింగ్ అంకుల్ లా కనిపిస్తున్నాడు అంటూ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ త్రోల్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ఇలా అయిపోయాడు ఏంటి అంటూ ప్రభాస్ గ్లామర్ పై జోకులు వేస్తున్నారు. దాంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రోల్స్ పై, యాంటీ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు. ప్రభాస్ లుక్ మాత్రం ఉన్న వయసుకంటే అధికంగా కనిపిస్తుంది.
సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నార్త్ ప్రేక్షకులు కూడా ప్రభాస్ లుక్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ గా భారీ ఫేమ్ తెచ్చుకున్న ప్రభాస్, తన లుక్, గ్లామర్ పై దృష్టి పెడితే మంచిది అని, చాలా మంది అభిప్రాయం. సాధారణంగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు అసలు వయసు కంటే ఓ పదేళ్లు తక్కువ కనిపిస్తారు. ప్రభాస్ మాత్రం అందుకు భిన్నంగా పదేళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు.