మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ కి పెళ్లి చేసుకోవాలని ఉందట. కానీ పిల్లలు అడ్డుపడుతున్నారని వాపోతుంది.
సుస్మితా సేన్.. ప్రస్తుతం నడుస్తున్న యుగం సోషల్ మీడియా యుగం కాబట్టి ఈ పేరు గురించి ఇప్పటి తరానికి కూడా బాగా తెలిసే ఉంటుంది. 90వ దశకంలో వాళ్ళకి ఐతే సుస్మితాసేన్ బాగా తెలుసు. సుస్మితాసేన్ 1994 వ సంవ్సతరంలో మిస్ యూనివర్స్ గా అంటే విశ్వ సుందరిగా నిలిచింది. హైదరాబాద్ లో జన్మించిన సుస్మితాసేన్ పలు హిందీ సినిమాల్లో నటించింది. నాగార్జునతో రక్షకుడు అనే సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పిల్లలే తన పెళ్ళికి అడ్డుపడుతున్నారని సుస్మిత చెప్పడం పెద్ద సంచలనం అయ్యింది.
సుస్మితాసేన్ 47 సంవత్సరాల వయసులోనూ ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోని అందంతో దగా దగా మెరుస్తూ ఉంటుంది. సినిమాల్లో ఎప్పటికప్పుడు ఎన్నో లవ్ స్టోరీస్ వస్తున్నట్లే సుస్మిత నిజ జీవితంలో కూడా ఎన్నో లవ్ స్టోరీలు. సుస్మిత సుమారు పది మంది అబ్బాయిలని ప్రేమించింది. మరి ఎవరి దిష్టి సుస్మిత లవ్ కి తగిలిందో కానీ ఏ ఒక్క లవ్ కూడా పెళ్లి పీటల దాకా వెళ్ళలేదు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు సుస్మిత లవ్ పెళ్లి వరకు వెళ్ళకపోవడానికి ఎన్నో కారణాలు. తన లవ్ పెళ్లి దాకా వెళ్ళనప్పుడు సుస్మిత బాధపడిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సుస్మిత తన పెళ్లి విషయంలో బాధ పడుతుందని తాజాగా తన ఇంటర్వ్యూ చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది.
ఏంటండీ సుస్మితకి పెళ్లి కాలేదు అంటున్నారు, మరి పిల్లలు ఆమె పెళ్ళికి ఒప్పుకోవడం లేదని అంటారేంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే సుస్మిత సుమారు 13 సంవత్సరాల క్రితమే ఇద్దరు పాపల్ని దత్తత తీసుకొని తన సొంత బిడ్డల్లా పెంచుకుంటుంది. సొంత బిడ్డల్లా ఏంటి వాళ్లిదరు సుస్మిత సొంత బిడ్డలే. ఎందుకంటే తనే ఆ ఆడపిల్లలిద్దరికీ రెని, అలీషా అనే పేర్లు పెట్టింది. రెని, అలీషా అంటే సుస్మితకి పంచ ప్రాణాలు. ఇన్ని సంవత్సరాల్లో వాళ్లిద్దరూ ఎప్పుడు కూడా అమ్మ మా నాన్నఎక్కడ అని అడగని విధంగా సుస్మిత వాళ్ళని పెంచింది. సుస్మిత ఫాదర్ కూడా పిల్లలకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు.
కానీ ఇప్పుడు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సుస్మిత మాట్లాడుతూ ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించి నా పిల్లలతో చెప్పినా కూడా వెంటనే నాపిల్లలు మాకు నాన్న అక్కర్లేదు అని అంటారు కానీ నేను పెళ్లి అని ఎందుకు అంటున్నానో కూడా ఆలోచించరు అని చెప్పి అందర్నీ షాక్ కి గురి చేసింది. ఈ సందర్భంగా తాను చెప్పిన ఒక డైలాగ్ అయితే సూపర్ గా ఉంది. ఎవరైనా మన జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతే మిస్ అయ్యాం అనే భావన ఉంటుంది కానీ అసలు జీవితంలోకే ఎవరు రాకపోతే మిస్ అయ్యాం అనే భావన ఉండదని కూడా సుస్మిత చెప్పింది. సుస్మిత ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ అయితే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి సుస్మితని పెళ్లిచేసుకోమని చెబుతున్నారు. ఎందుకంటే రేపు తన పిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళాక సుస్మిత ఒంటరిగా ఉండిపోకూడదు కదా.