రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ పోజింగ్ తో శృంగారతారనా అనే ముద్ర వేసింది ప్రేక్షకుల్లో. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు.
రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ పోజింగ్ తో శృంగారతారనా అనే ముద్ర వేసింది ప్రేక్షకుల్లో. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు. అయితే రాఖి సావంత్ పెళ్లిళ్ల వ్యవహారం తరచుగా సోషల్ మీడియాలో రచ్చ కెక్కుతొంది. రాఖి సావంత్ మొదటి భర్త రితేష్ నుంచి రెండేళ్ల క్రితం విడిపోయింది. ఆ తర్వాత ఆదిల్ దురానీ అనే కుర్రాడితో ప్రేమాయణం సాగించి పెళ్లి కూడా చేసుకుంది. ఎవరీకి తెలియకుండా సీక్రెట్ గా రాఖీ సావంత్ ఆదిల్ దురానీని వివాహం చేసుకుంది. అయితే కొంత కాలానికి ఆదిల్ నుంచి కూడా రాఖీ విడిపోయింది. ప్రస్తుతం విళ్లీద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేంత రచ్చ సాగుతోంది.
మీడియాతో మాట్లాడుతూ.. ఆదిల్ దరానీపై సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆదిల్ తన ప్రియురాలైన ఇరానీ అమ్మాయిపై అరు నెలలపాటు అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతే కాకుండా తనను కొట్టి హింసించాడని వాపోయింది. అంతే కాకుండా లైంగిక వేధింపులకు గురిచేసి.. తన నగ్న వీడియోలను రికార్డ్ చేసి దుబాయ్ లో అమ్మేశాడని రాఖీసావంత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను వాష్ రూమ్ లో ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసేవాడని.. అలాంటి విడియోలు అతని వద్ద చాలా ఉన్నాయని రాఖీ పేర్కొంది. అ వీడియోలను దుబాయ్ లో రూ. 47లక్షలకు అమ్మేశాడని రాఖీసావంత్ వెల్లడించింది. ఇలా తనకు ఎంతో అన్యాయం చేసిన ఆదిల్ ను తన భర్తగా భావించడం లేదని, అతడి నుంచి విడాకులు కోరుకుంటున్నానని చెప్పింది రాఖీ సావంత్.
రాఖీ సావంత్ ఎన్నో చిత్రాల్లో నటించింది. అందులో కొన్ని న తుమ్ జానో న హమ్, చుర లియా హై తుమ్నే, మస్తీ: సనమ్ తేరి కసమ్, గుమ్నామ్ – ది మిస్టరీ, ఏక్ కహానీ జూలీ కీ వంటి చిత్రాలు చేసి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో మెరిసింది. బాలీవుడ్ లో ఇలాంటి సంఘటనలు జరగడం కామన్ అంటున్నారు కొందరు నెటిజన్లు. ముందు లవ్ చేయడం తర్వాత పెళ్లి మరుసటీ రోజు విడాకాలు సినీ రంగాల్లో రోటీన్ గా జరిగేదే అని మరి కొందరి వాదన. చూడాలి మరి రానున్న రోజుల్లో రాఖీ సావంత్ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో.