బాలీవుడ్ లో నిషాకళ్ల సుందరిగా పేరు తెచ్చుకుంది కాజోల్. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కాజోల్ స్టార్ హీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది.
బాలీవుడ్ లో స్టార్ నటుల వారసులు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి తనూజ సమర్థ్ కూతురు కాజోల్. ఆమె తండ్రి షోము ముఖర్జీ ప్రముఖ దర్శక, నిర్మాత. తల్లిదండ్రులిద్దరూ ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో 16 ఏళ్ల వయసులోనే ఆమెకు సినీ అవకాశం వచ్చింది. రాహుల్ రవైల్ దర్శకత్వంలో ‘బెఖుడి’లో నటించింది. 1993లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బాజీగర్’ మూవీతో అటు షారూఖ్, ఇటు కాజల్ కి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజోల్ పలు వెండితెరపైనే కాదు వెబ్ సీరీస్ లో నటిస్తుంది. తాజాగా కాజోల్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.
బాలీవుడ్ ముద్దుగుమ్మ కాజోల్ ప్రస్తుతం వెబ్ సీరీస్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ‘ది ట్రయల్’ అనే వెబ్ సీరీస్ లో నటిస్తుంది.. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో లాయర్ నోయోనికాసేన్ గుప్తా అనే పాత్రలో నటించింది. అమెరికన్ వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’ కు ‘ది ట్రయల్’ఇండియన్ వెర్షన్ గా తెరకెక్కింది. భర్త చేతిలో మోసపోయిన ఓ లాయర్ తన జీవితంలో వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొంది అనే కథతో ఈ వెబ్ సీరీస్ ఈ సిరీస రూపొందింది. ఈ సిరీస్ లో కాజోల్ నటన పట్ల విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా కాజోల్ చేతి కర్ర సహాయంతో నడిచే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నటి కాజోల్ తన ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో చేతి కర్ర సహాయంతో నడిచి వెళ్లే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కాజోల్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. ఆ కారణం చేతనే ఆమె మోచేతికి కర్ర మెల్లిగా తన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తుంది. అయితే ఈ విషయంపై ఈ విషయంపై ఎలాంటి వివరాలు అఫిషియల్ గా వెల్లడించలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారే ఆందోళన చెందారు. మిస్టిరీ థ్రిల్లర్ మూవీ దో పట్టీ లో నటిస్తుంది. ఈ మూవీలో కాజోల్ తో పాటు కృతి సనన్‌తో కలిసి నటించనుంది. ఈ ప్రాజెక్ట్ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది.