తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి బాలీవుడ్ దాటిపోయి హాలీవుడ్ రేంజ్‌కు చేరిపోయింది. బహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు వచ్చాక.. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు మిగిలిన ఇండస్ట్రీకి చెందిన మేకర్స్.
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి బాలీవుడ్ దాటిపోయి హాలీవుడ్ రేంజ్‌కు చేరిపోయింది. బహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు వచ్చాక.. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు మిగిలిన ఇండస్ట్రీకి చెందిన మేకర్స్. అందుకే ఇక్కడి హీరోలతో సినిమాలు చేసేందుకు సిద్ధమౌతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ దర్శకులు ఇటీవల కాలంలో తెలుగు హీరోలతో ఎక్కువగా సినిమాలు చేశారు. అటువంటి సినిమాల్లో ఒకటి బ్రో. తమిళ దర్శకుడు కమ్ నటుడు సముద్ర ఖని తెరకెక్కించిన సినిమా ‘బ్రో’. వినోదయ సీతం అనే తమిళ సినిమాకు రీమేక్ ఇది. తెలుగులో కథలో మార్పులు చేశారు దర్శకుడు త్రివిక్రమ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి థరమ్ తేజ్ మల్లీ స్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28 నుండి థియేటర్లలో సందడి చేస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించగా.. రోహిణి, బ్రహ్మనందం, తనికెళ్ల భరణి, అలీరెజా, సుబ్బరాజు, పృథ్వీతో పాటు స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడింది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతాలా. తెలుగు సినిమాల్లో అందులోనూ బడా హీరోల సినిమాలో ఐటమ్ సాంగ్స్ కామన్. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిన నటి ఎవరంటే ఊర్వశినే. ‘వేరీ ఈజ్ ద పార్టీ’అంటూ మెగాస్టార్ చిరంజీవితో ఎప్పుడైతే జతకట్టిందో.. అప్పటి నుండి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆ తర్వాత అక్కినేని వారసుడు అఖిల్ ఏజెంట్ సినిమాలోనూ ఓ ప్రత్యేక సాంగ్ లో దుమ్ము రేపింది. తాజాగా బ్రో సినిమాలో మై డియర్ మార్కండేయ పాటలో కాలు కదిపింది. అయితే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదే ఆమె విమర్శలు పాలయ్యేలా చేసింది.
ఇంతకు ఏం జరిగిందంటే.. ఈ నెల 28న బ్రో సినిమా విడుదల సందర్భంగా ముందు రోజు ట్విట్టర్ వేదికగా.. ఈ సినిమానుద్దేశించి ట్వీట్ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో నటించడం ఆనందంగా ఉందని రాసుకొచ్చింది. ఈ ట్వీటుతో ఆమె ట్రోల్స్‌కు గురయ్యింది. ఈ ట్వీట్ చూసిన వైసీపీ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. మీకు ఏపీ ముఖ్యమంత్రి ఎవరో తెలియదా అంటూ మండిపడ్డారు. తమ నేత జగన్ రాష్ట్రానికి సీఎం అంటూ ఆయన ఫోటోలు ట్యాగ్ చేశారు. అవకాశాల కోసం ఏదీ పడితే అది మాట్లాడతారా అంటూ విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అయిపోయారు. 2024లో ఇదే అవుతుందని, ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. తనను ట్రోలింగ్ చేస్తున్న విషయాన్ని లేటుగా గ్రహించింది భామ. అయితే తప్పు తెలుసుకున్న ఊర్వశి ఆ ట్వీట్ తొలిగించలేదు సరికదా.. ఏపీ ముఖ్యమంత్రి అన్న పదాన్ని తొలగించి.. సరికొత్త ట్వీట్ చేసింది. మరీ ఇప్పుడైనా జగన్ ఫ్యాన్స్ కోపం చల్లారిందో లేదో..
Delighted to share screen space with the esteemed @PawanKalyan garu in our film #BroTheAvatar 🎥 🍿 releases tomorrow #28thJuly worldwide 🌎 story about an arrogant person who is given a second chance to fix his mistakes after death. See you all ♥️ @IamSaiDharamTej… pic.twitter.com/Kkwceakf7N
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) July 28, 2023