ప్రస్తుత కాలంలో పోయిన వస్తువు కానీ, డబ్బును కానీ తిరిగి పొందడం చాలా కష్టం. ఒకప్పుడు.. పరుల సొమ్మును పాముగా భావించేవారు అధికంగా ఉండేవారు. కానీ నేటికాలంలో మాత్రం.. ఎవరి డబ్బైతే ఏంటి.. మనకు దొరికిన తర్వాత.. అది మన సొంతం అవుతుంది. నేనేం దొంగతనం చేయలేదు. ఇంకేందుకు వెనక్కి ఇచ్చేయాలని ఆలోచించేవారే అధికం. ఇక ప్రయాణాలు చేసే సమయంలో కార్లు, బస్సులు, ఆటోల్లో బ్యాగ్‌లు, పర్స్‌లు వంటివి మర్చిపోవడం సర్వ సాధారణంగా జరిగే అంశం. వెంటనే గుర్తుకు వచ్చినా లాభం ఉండదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఇక మన అదృష్టం బాగుంటే.. అలా మర్చిపోయిన వస్తువులు దొరుకుతాయి.. లేదంటే ఇక వాటి సంగతి మర్చిపోవాలి. తాజాగా ఓ ఎన్నారైకి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. కార్లో.. కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగ్ మర్చిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక పోలీసులను ఆశ్రయించాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే..
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్, గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ఓ ఎన్నారై.. ఓ వివాహానికి హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో పెళ్లికి హాజరైన తర్వాత.. గురుగ్రామ్ నుంచి గ్రేటర్ నోయిడాలోని అతడు బస చేసిన హోటల్‌కి వెళ్లడానికి కారు బుక్ చేశాడు. ఇక అతడితో పాటు పెద్ద బ్యాగ్ తీసుకుని కారు ఎక్కాడు. దానిలో కోటి రూపాయల విలువైన ఖరీదైన బంగారు ఆభరణాలున్నాయి. అయితే కారు దిగే హాడావుడిలో బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌ను కారులోనే మర్చిపోయాడు. డ్రైవర్ కూడా ఇది గమనించలేదు.
కాసేపటి తర్వాత చేతిలో బ్యాగ్ లేదని.. సదరు ఎన్నారై గుర్తించాడు. ఒక్క నిషియం షాక్‌తో అతడి బుర్ర పనిచేయడం ఆగిపోయింది. అవును మరి ఆ బ్యాగ్‌లో కోటి విలువైన బంగారు ఆభరణాలన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. షాక్ నుంచి కోలుకున్న తర్వాత వెంటనే ఆలస్యం చేయకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. జరిగిన సంఘటన గురించి వారికి ఫిర్యాదు చేశాడు.
అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నాలుగు గంటల వ్యవధిలోనే.. అతడు ప్రయాణం చేసిన ఊబర్ కారును గుర్తించారు. వెంటనే క్యాబ్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి కారులో ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని.. సదరు ఎన్నారైకి తిరిగి అప్పగించారు. పోయింది అనుకున్నసొమ్ము తిరిగి దక్కే సరికి.. ఎన్నారై సంతోషం అంతా ఇంతా కాదు. ఈ విషయంలో తనకు సాయం చేసిన నోయిడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. బ్యాగులో ఆభరణాలు అన్ని ఉన్నట్లు గుర్తించాడు. సంతోషంగా తన బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడు.
ग्रेटर नोएडा वेस्ट शादी में शामिल होने आए NRI व्यक्ति का लगभग 01 करोड़ से अधिक कीमत की ज्वेलरी से भरा बैग उबर कैब में भूलवंश रह गया था जिसकी सूचना थाना बिसरख पुलिस को मिलते ही मात्र 04 घंटे के अंदर अथक प्रयास कर शत प्रतिशत ज्वेलरी से भरे बैग को सुपुर्द किया गया।@Uppolice pic.twitter.com/hsqnsF86rN
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) November 30, 2022