దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు భారతదేశంలో ఎన్నో వ్యాపారాలతో తనదైన మార్క్ చాటుకున్న మాల్యా ఒక్కసారే దివాల తీయడంతో బ్యాంకులకు టోకరా వేసి విదేశాలకు పారిపోయాడు.
విజయ్ మాల్యా ఈ పేరు భారత దేశంలో ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి పరారీలో ఉన్న వ్యాపార వేత్త. ఒకప్పుడు దేశంలో తన వ్యాపారాలతో ఒక ట్రెండ్ సృష్టించిన విజయ్ మాల్యా అదే స్థాయిలో దివాలా తీయడంతో పెద్ద పెద్ద బ్యాంకులకు టోపీ పెట్టి విదేశాలకు ఉడాయించాడు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన విజయ్ మాల్యాకి తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వివరాల్లోకి వెళితే..
దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి ప్రస్తుతం పరారీలో ఉన్న విజయ్ మాల్యాని ఆర్థిక నేరస్తుడిగా దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించి, ఆస్తులను జప్తు చేయాలని ముంబై కోర్టు లో జరుగుతున్న విచారణను సవాల్ చేస్తూ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటీషన్ ని సుప్రీం కోర్టు శుక్రవారం తోసి పుచ్చింది. ఆర్ధిక నేరగాడిగా దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి.. ప్రస్తుతం జరుగుతున్న విచారణను అడ్డుకోలేమని తేల్చిచెప్పింది. కాగా, ఈ విషయంలో పిటీషనర్ నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రావడం లేదని మాల్యా తరుపు లాయర్ వాదించడంతో ఈ పిటీషన్ ను ధర్మాసనం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ రాజేష్ బిందాల్ లతో కూడిన ధర్మాసనం పిటిషన్ కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. దీంతో మరోసారి విజయ్ మాల్యాకు కోర్టులో చుక్కెదురైంది.
2016 లో ఎస్ బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు తొమ్మిది వేల కోట్లకు పైగా ఎగవేసి లండన్ పారిపోయాడు విజయ్ మాల్యా. అప్పటి నుంచి ఆయనపై ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. విజయ్ మాల్యపై సీఐడీ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఈ క్రమంలోనే 2019 లో ముంబై కోర్టు చట్ట ప్రకారం విజయ్ మాల్యాని పరారీదారు గా ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ మాల్యా తర్వాత పీఎన్‌బీ స్కాం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సైతం బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయాడు. ఇదిలా ఉంటే.. దేశంలో వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన వారిని తిరిగి రప్పించడం, ఆస్తుల రికవరీపై బహుపాక్షిక చర్యలపై కేంద్రం కసరత్తు చేస్తుంది.