దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు భారతదేశంలో ఎన్నో వ్యాపారాలతో తనదైన మార్క్ చాటుకున్న మాల్యా ఒక్కసారే దివాల తీయడంతో బ్యాంకులకు టోకరా వేసి విదేశాలకు పారిపోయాడు.
సాయి పల్లవికి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. విరాటపర్వం మూవీ ప్రమోషన్ల సందర్భంగా ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో పాటుగా.. గోరక్షకులపై సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భజరంగ్‌దళ్ నాయకులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. న్యాయ సలహాతో కేసు నమోదు చేసిన పోలీసులు సాయిపల్లవికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వాటిని రద్దు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. […]
దేశ రక్షణ కోసం సైన్యంలో చేరతానని కుమారుడు చెప్పినప్పుడు.. ఆ తల్లి చాలా సంతోషించింది. తన బిడ్డ కేవలం తన స్వార్థం కోసం మాత్రమే కాక.. భరతమాత రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడని పొంగిపోయింది. కానీ ఆ తల్లి త్యాగం వృథా అయ్యింది. దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరిన కుమారుడు.. పాకిస్తాన్ సేనలకు చిక్కి.. ఆ దేశ జైళ్లో మగ్గుతున్నాడు. ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. పాతికేళ్లుగా పాక్ జైల్లో మగ్గుతున్న కుమారుడిని […]
కరోనా కట్టడికి వ్యాక్సినే కీలక ఆయుధం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీకా రెండు డోసులు తీసుకుంటే.. కరోనా వచ్చినా మరణాలు ఎక్కువగా సంభవించవని ప్రచారం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా శరవేగంగా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ పై ఇప్పటికి చాలామందికి పలు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఔరంగాబాద్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల తన బిడ్డ […]
తమిళ్ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇళయ దళపతికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2012లో విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వేసిన పిటిషన్ ను మద్రాస్ ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. వేసిన పిటిషన్ ను తోసి పుచ్చింది హైకోర్ట్. విజయ్ ఎప్పుడూ పన్ను చెల్లించక పోవడమే కాక నిరంతరం తప్పించుకుంటూ ఉండటంతో, వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లగ్జరీ రోల్స్ రాయిస్ […]
తమిళనాడులో ప్రతీకార రాజకీయాలకు మళ్లీ తెరలేస్తుందని కథనాలు అల్లేసుకున్నారు. తమిళనాడు నూతన సారథి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ఊరుకునేవారు కాదని భావించారు. కానీ స్టాలిన్ మాత్రం సరికొత్త రాజకీయాలకు తెరతీశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజునుంచే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్షాలు కూడా నిర్మోహమాటంగా స్టాలిన్‌ను శభాష్ అంటున్నాయి. ప్రజలకు ఏది అవసరం అనుకుంటే దాన్ని కొనసాగిస్తున్నారు. జయలలితన పేరట వెలిసిన అమ్మ క్యాంటిన్లను తీసేయకుండా కొనసాగిస్తున్నారు. అమ్మ క్యాంటిన్ల వల్ల అన్నా డీఎంకేకు మంచి పేరు […]